అల్లు అర్జున్ 20 ముహూర్తం ఖరారు !

Sunday,September 15,2019 - 02:02 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మోస్ట్ ఎవైటింగ్ సినిమాకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమాను అక్టోబర్ 3 న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన సుకుమార్ ప్రస్తుతం సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు. నవంబర్  నుండి షూటింగ్ మొదలు పెట్టే  ఆలోచలో ఉన్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్ సరసన రష్మికను హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు. మిగతా నటీనటులు కూడా ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉంది సుక్కు అండ్ టీమ్. ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.