Allu Arjun - ఆ ఇద్దరు దర్శకులు ఫిక్స్?

Monday,May 03,2021 - 04:34 by Z_CLU

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అన్నిఅనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ కొరటాల -బన్నీ కాంబోలో సినిమా రావాలి. కానీ కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయడంతో బన్నీ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ లోపు బన్నీ ఓ ఇద్దరు డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమాలకు ఫిక్సయ్యాడట. అందులో ఒకరు కోలీవుడ్ డైరెక్టర్ కాగా మరొకరు కన్నడ డైరెక్టర్ అట.

అవును.. నెక్స్ట్ మురుగదాస్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట బన్నీ. ఎప్పట్నుంచో ఈ ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంది. అల్లు అర్జున్ కోసం ఒక కథ సిద్దం చేసి దాని స్క్రిప్ట్ పనిలో ఉన్నాడట మురుగదాస్. ఈ సినిమా తమిళ్, తెలుగు బైలింగ్వెల్ గా తెరకెక్కనుందని సమాచారం.

అయితే మురుగదాస్ తర్వాత అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా సినిమాను రెడీ చేస్తున్నాడు. అందు కోసం పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన ‘KGF’ డైరెక్టర్ ని ఎంచుకున్నాడు. అతడే ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ కాంబో సినిమా ఓకె అయిపోయిందని ప్రభాస్ తో చేస్తున్న సలార్ తర్వాత ప్రశాంత్, బన్నీని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈ లోపు అల్లు అర్జున్ మురుగదాస్ సినిమాను పూర్తి చేస్తాడని అంటున్నారు. ఏదేమైనా పుష్ప తర్వాత మిగతా భాషల్లో ఎక్కువ ఫోకస్ చేసి ఆయా భాషల్లో స్టార్ డైరెక్టర్స్ ని పట్టుకొని సినిమాలు చేయబోతున్నాడు ఐకానిక్ స్టార్.

ప్రస్తుతానికి కార్డ్స్ లో ఉన్న ఈ రెండు కాంబినేషన్ సినిమాలో ముందుగా బన్నీ -మురుగదాస్ కాంబో ఎనౌన్స్ అవ్వనుందని సమాచారం. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళాక ఒక మంచి సందర్భం చూసుకొని ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics