Allu Arjun Salman- బన్నీకి థాంక్స్ చెప్పిన బాలీవుడ్ స్టార్

Monday,April 26,2021 - 05:53 by Z_CLU

ఒక భాషలో సూపర్ హిట్టైన పాటను మరో భాషలో వాడటం చాలా అరుదుగా చూస్తుంటాం. తెలుగులో ఉర్రూతలూగించిన #Seetimaarr పాటను ఇప్పుడు హిందీ సినిమాలో వాడుకున్నారు మేకర్స్.

అల్లు అర్జున్ ఎనర్జిటిక్ స్టెప్స్, స్టైలిష్ మేనరిజమ్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సాంగ్ ను తన ‘రాధే’ కోసం వాడుకున్నాడు సల్మాన్ ఖాన్. ఈరోజే ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు. ట్విట్టర్ ద్వారా ఈ పాటను విడుదల చేస్తూ అల్లు అర్జున్ కి థాంక్స్ చెప్పాడు సల్లు భాయ్.

allu arjun salman

జస్ట్ థాంక్స్ తో సరిపెట్టకుండా సాంగ్ లో బన్నీ డాన్సులను పొగుడుతూ అభినందించాడు సల్మాన్. “సాంగ్ లో నీ పెర్ఫార్మెన్స్ , నువ్వు డాన్స్ చేసిన విధానం , నీ స్టైల్ అంటూ తనను ఎట్రాక్ట్ చేసిన వాటి గురించి చెప్తూ యూ ఆర్ సింప్లీ ఫన్టాస్టిక్ అంటూ కితాబిచ్చాడు సల్మాన్. చివర్లో టేక్ కేర్ బీ సేఫ్ అని చెప్తూ లవ్యూ బ్రదర్” అంటూ ఎండ్ చేశాడు. ఇక సల్మాన్ ఖాన్ ట్వీట్ కి వెంటనే రెస్పాండ్ అవుతూ తన దైన శైలిలో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రిప్లై ఇచ్చాడు బన్నీ. “థాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. ఇట్స్ మై ప్లెజర్ టు రిసీవ్ కాంప్లిమెంట్స్ ఫ్రం యూ” అంటూ సల్మాన్ కి తిరిగి థాంక్స్ చెప్పిన బన్నీ ‘రాధే’ సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. సీటిమార్ పాటకు మీ అభిమానులు స్టెప్స్ వేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు చూపించిన ప్రేమకు థాంక్స్ అంటూ రెస్పాన్స్ అయ్యాడు.

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘రాధే’ సినిమాలో సీటిమార్ సాంగ్ కి మ్యూజిక్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. ప్రభు దేవా దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మే 13 థియేటర్స్ తో పాటు జీ ప్లెక్స్ లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి ఈ ఈద్ కి రాధే గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సల్మాన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

salman devisri seetimaar

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics