Pawan Kalyan - హీరోయిన్ ఫిక్స్?

Monday,May 03,2021 - 05:02 by Z_CLU

ఒక స్టార్ హీరో సినిమా ఎనౌన్స్ మెంట్ నుండే అతని పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరై ఉంటారా అంటూ ఇలాగే ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో రానా తో కలిసి పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించనుంది. ఇటివలే ఆమె ను ఫైనల్ చేసి మీడియాకి విషయం కూడా చెప్పేసారు నిర్మాత. అయితే పవన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా బయటపెట్టలేదు మేకర్స్.

కొన్ని రోజులుగా పవన్ హీరోయిన్ గా నిత్య పేరు బాగా వినబడుతుంది. తాజాగా పవన్ కి హీరోయిన్ గా నిత్యా మీనన్ ని ఫైనల్ చేసారనే టాక్ నడుస్తుంది. సినిమాలో నిత్యా పవన్ కి భార్యగా నటించనుంది. ఇప్పటికే ఆమె ఈ సినిమాకు సైన్ చేసి త్వరలోనే సెట్స్ పైకి రానుందని తెలుస్తుంది. అయితే పవన్ హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. చివరికి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఈ రోల్ నిత్యా మీనన్ ని వరించింది కాబోలు.

ప్రస్తుతం హైదరాబాద్ లో కొంత భాగం షూట్ చేశారు యూనిట్. అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ఓ సెట్ వేసి పవన్ రానా లపై సన్నివేశాలు తీశారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే -డైలాగ్స్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడిన వెంటనే మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు యూనిట్.

ఇక ఆ షూటింగ్ మొదలయ్యాక నిత్యా కి వెల్కం చెప్తూ హీరోయిన్ గా ఆమెను ఎనౌన్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలిస్తుంది. మరి పవన్ నిత్యా మీనన్ మొదటి కాంబో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తుంది.

– Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics