బన్నీ ఆ సినిమా చేయబోతున్నాడా ?

Saturday,August 04,2018 - 02:00 by Z_CLU

అల్లు అర్జున్  నెక్స్ట్ సినిమాపై ఫాన్స్ లో రోజు రోజుకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది.  విక్రం కె.కుమార్ తో బన్నీ ఓ సినిమా చేస్తాడనే వార్త మొన్నటి వరకూ చక్కర్లు కొట్టింది. బన్నీ చేయబోయే నెక్స్ట్ సినిమా ఆల్మోస్ట్ ఇదేననే న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే  ఈ మధ్యే నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదని అఫీషియల్ చెప్పేసాడు బన్నీ.

అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ నెక్స్ట్ సినిమా గురించి మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత ఇప్పటివరకూ తను టచ్ చేయని డిఫరెంట్  జోనర్  సినిమా చేయాలనీ చూస్తున్న బన్నీకి ఇటివలే ఓ పోలిటికల్ డ్రామా స్టోరీ వినిపించాడట డెబ్యూ డైరెక్టర్.

స్టోరీ లైన్ తో పాటు కొన్ని సీన్స్ కూడా విన్న  బన్నీ నెక్స్ట్  ఈ సినిమాకే ఫిక్స్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ పొలిటికల్ డ్రామాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడట ఆ దర్శకుడు. సో పొలిటికల్ డ్రామా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఈ టైంలో స్టైలిష్ స్టార్ ఈ జోనర్ సినిమా చేస్తే ఫాన్స్ పండగే..