స్పెషల్ ట్రేనింగ్ తీసుకోబోతున్న అల్లు అర్జున్

Wednesday,July 26,2017 - 02:32 by Z_CLU

అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ కి రెడీ అవుతున్నాడు. ఆర్య నుండి బిగిన్ అయితే మొన్నటికి మొన్న రిలీజైన DJ వరకు తన లుక్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే బన్ని, ఈ సినిమా కోసం స్పెషల్ ట్రేనింగ్ తీసుకోవడానికి US కి వెళ్తున్నాడు.

ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ లా కనిపించడం కోసం, అప్పుడే ప్లానింగ్ బిగిన్ చేసేశాడు బన్ని. U.S. ట్రేనర్స్ సజెస్ట్ చేసిన దాని ప్రకారం అప్పుడే డైట్ ప్లాన్ కూడా మార్చేసుకున్న బన్ని, ఈ సినిమాలో పక్కా ఫైటర్ లా కనిపించడం కోసం టఫ్ ట్రేనింగ్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. అనూ ఇమ్మాన్యువెల్  హీరోయిన్. ఈ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ కి విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు.