ప్రేమికుల రోజు కానుకగా ‘నా పేరు సూర్య’ సెకండ్ సింగిల్

Tuesday,February 06,2018 - 11:03 by Z_CLU

బన్నీ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ నా పేరు సూర్య. మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ సాంగ్ విడుదలైంది. సోషల్ మీడియాలో అది ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఆ ఊపును అలానే కొనసాగిస్తూ, సెకెండ్ సింగిల్ రిలీజ్ చేయబోతోంది యూనిట్. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ‘ లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.

ఫస్ట్ సింగిల్ లో సైనికుల గొప్పదనాన్ని చాటేలా దేశభక్తి గీతాన్ని విడుదల చేశారు. సెకెండ్ సింగిల్ లో బన్నీ, అను ఎమ్మాన్యుయేల్ కలిసి నటించిన డ్యూయట్ ను విడుదల చేయబోతున్నారు. శేఖర్ ఈ సాంగ్ పాడాడు. బాలీవుడ్ స్టయిల్ లో మరింత ఫ్రెష్ గా ఉండబోతోంది ఈ సాంగ్.

అల్లు అర్జున్ ని మోస్ట్ ఎగ్రెసివ్ గా చూపిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నారు.