'ఇంటిలిజెంట్‌' సెన్సార్‌ పూర్తి - ఫిబ్రవరి 9 రిలీజ్

Tuesday,February 06,2018 - 11:32 by Z_CLU

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ”సాయిధరమ్‌ తేజ్‌, వినాయక్‌ తొలి కాంబినేషన్‌లో రూపొందిన మా ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అందర్నీ ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. సాయిధరమ్‌తేజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా వినాయక్‌ ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్‌తో రూపొందిననీ సినిమా డెఫినెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుంది” అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల
సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
సంగీతం: థమన్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
ఆర్ట్‌: బ్రహ్మ కడలి
ఫైట్స్‌: వెంకట్‌
డాన్స్‌: శేఖర్‌, జాని
నిర్మాత: సి.కళ్యాణ్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌