'డీజే' అప్ డేట్స్

Wednesday,March 08,2017 - 06:20 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ దిల్ రాజు నిర్మిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘డీజే దువ్వాడ జగన్నాథం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. టీజర్ తో భారీ అంచనాలు నెలకొలిపిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం  అబుధబీ లో జరుగుతుంది.. ప్రెజెంట్ అబుధబీ లోని అందమైన లొకేషన్స్ లో  బన్నీ పూజా హెగ్డే పై డ్యూయెట్ సాంగ్  షూట్ చేస్తున్నారు యూనిట్ …

దేవి శ్రీ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు…  ఇప్పటికే అబుధబీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు సాంగ్ షూట్ కూడా పూర్తి చేసి మార్చ్ 10న హైదరాబాద్ తిరిగి రానున్నారు ‘డి జె’ యూనిట్..