'మహేష్ 23' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Wednesday,March 08,2017 - 07:40 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ప్రెజెంట్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకుండా టైటిల్ పై మేకర్స్ సస్పెన్స్ మైంటైన్ చేస్తుండడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మహేష్ ఫాన్స్…

ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ఏ టైటిల్ ఫైనల్ చేసారా అనే ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నసూపర్ స్టార్ ఫాన్స్ కి గుడ్ న్యూస్… లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మార్చ్ 10న సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు యూనిట్. మార్చ్ 10 సాయంత్రం ఈ ఫస్ట్ లుక్ ను మురుగదాస్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేస్తారని సమాచారం…