BB3 లో అల్లరోడు?

Tuesday,September 15,2020 - 12:26 by Z_CLU

Balayya, Boyapati కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ఉందని, ఆ పాత్రను ఓ యంగ్ హీరోతో చేయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆ పాత్రకు Naveen Polishetty పేరు వినిపించగా తాజాగా Allari Naresh పేరు చక్కర్లు కొడుతుంది.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో స్పెషల్ రోల్ ను అల్లరోడితో చేయించాలని భావిస్తున్నాడట Boyapati Srinu.మొన్నీ మధ్య Mahesh ‘Maharshi’ లో నరేష్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు బోయపాటి తన సినిమాలో క్యారెక్టర్ కి అల్లరి నరేష్ ని ఫిక్స్ అయ్యారట.

ఇటివలే నరేష్ ను కలిసి క్యారెక్టర్ తో పాటు స్క్రిప్ట్ కూడా చెప్పారని సమాచారం. ప్రస్తుతం హీరోగా ‘Naandi’ సినిమా చేస్తున్నాడు నరేష్. మరి ప్రచారం జరుగుతున్నట్లు BB3 లో స్పెషల్ రోల్ లో కనిపిస్తాడా లేదా నరేష్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.