#BB3 - మళ్లీ హీరోయిన్ మారిపోయింది
Saturday,November 21,2020 - 03:15 by Z_CLU
బాలకృష్ణ-బోయపాటి సినిమాకు సంబంధించి కొత్తగా మరో హీరోయిన్ తెరపైకి వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈరోజు నుంచి షూటింగ్ కూడా షురూ అయింది.

#BB3 (Balakrishna-Boyapati)లో ముందుగా మలయాళీ బ్యూటీ ప్రయాగ మార్టిన్ ను తీసుకున్నారు. ఆమెతో 2 రోజులు షూట్ కూడా చేశారు. అంతలోనే ఆమెను తప్పించారు.

ప్రయాగ మార్టిన్ స్థానంలో సాయేషా సైగల్ ను తీసుకున్నారు. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఈరోజు ఆమె సెట్స్ పైకి రావాలి. అంతలోనే ఆమె స్థానంలో Pragya Jaiswal ను తీసుకున్నారు.

రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో బాలయ్య-ప్రగ్యా మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రగ్యా చేరిన విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.