బాలయ్య నుంచి స్వీట్ సర్ ప్రైజ్

Tuesday,June 09,2020 - 12:01 by Z_CLU

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఈరోజు ఫస్ట్ లుక్ రాబోతోంది. దీనికి #BB3 First Roar అని పేరుపెట్టారు. అయితే ఫస్ట్ లుక్ లో భాగంగా టైటిల్ రిలీజ్ చేస్తారా.. బాలయ్య స్టిల్ రిలీజ్ చేస్తారా.. లేక చిన్న వీడియో రిలీజ్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు 2 సీన్స్ పిక్చరైజ్ చేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. అప్పుడు తీసిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి ఓ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కేవలం ఇది మాత్రమే కాదు.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చాలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేశారు. మరీ ముఖ్యంగా ఇది బాలయ్య 60వ పుట్టినరోజు (షష్టిపూర్తి) కావడంతో హంగామా డబుల్ అయింది.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు బాలయ్య స్వయంగా ఆలపించిన ఓ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూల్లో బాలయ్య బయటపెట్టారు. ఇక 6 గంటలకు మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు అభిమానులు. 7 గంటలకు బోయపాటి సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తుంది. రాత్రి 8 గంటలకు ఇప్పటివరకు బాలయ్యకు సంబంధించి ఎవ్వరూ చూడని వింటేజ్ పిక్స్ ను రిలీజ్ చేయబోతున్నారు.