టార్గెట్ ఫిక్స్ చేసిన సిసింద్రీ

Friday,October 14,2016 - 08:30 by Z_CLU

మనం సినిమాలో కన్పించింది కాసేపే అయినా, కెరీర్ మొత్తానికి సరిపోయేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు అఖిల్. తన మొదటి సినిమా ‘అఖిల్’ తో యాక్టింగ్ పరంగా నూటికి నూరు మార్కులు కొట్టేశాడు.

     తన రెండో సినిమా విషయంలో దర్శకుడి సెలక్షన్ నుండి కథ ఎంపిక వరకు అన్ని యాంగిల్స్ లో జాగ్రత్తలు తీసుకుంటున్న

అఖిల్

ఎట్టకేలకు విక్రమ్ కుమార్ కథకు ఓకే చేశాడు. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ఇప్పటికే హోం వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు సమాచారం. విక్రమ్ చెప్పిన కథకు తగ్గట్టు తనను తాను మార్చుకోవడంతో పాటు కొన్ని షేడ్స్ లో ఎలా కనిపించాలో ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా జంటిల్ మేన్ ఫేం నివేద థామస్ పేరును పరిశీలిస్తున్నారు. డిసెంబర్ కల్లా  సినిమాని లాంచ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు. A.R.రెహ్మాన్ సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది.