సంథింగ్ స్పెషల్ ...

Friday,October 14,2016 - 09:00 by Z_CLU

తెలుగులో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలు చాలానే ఉన్నాయి. ఎంతోమంది దర్శకులు ఎన్నో క్యారెక్టర్స్ ఇచ్చారు. అయితే ఒకే ప్రొడక్షన్ హౌజ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషించిన ఘనత మాత్రం ప్రకాష్ రాజ్ కే దక్కుతుంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ పేరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అయితే ఆ నిర్మాత పేరు దిల్ రాజు. అవును.. దిల్ రాజు బ్యానర్ లో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రలు చాలా వరకు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా శతమానం భవతి సినిమాలో కూడా దిల్ రాజు ఓ మంచి క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. కుటుంబ పెద్దగా ప్రకాష్ రాజ్ గెటప్ అదిరిపోయింది.

దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘దిల్’ నుండి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ‘దిల్’ నుండి మొన్నటి సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ వరకూ ఎన్నో పాత్రలతో దిల్ రాజు సినిమాల్లో అలరించాడు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు’,’పరుగు’,’కొత్త బంగారు లోకం’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలలో ప్రకాష్ రాజ్ పాత్రలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అందుకే దిల్ రాజు ప్రకాష్ రాజ్ ను ఎప్పుడూ మిస్ అవ్వడు. ఒకట్రెండు సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఎప్పీయరెన్స్ మిస్ అయినా.. ఆ వెంటనే మరో మంచి క్యారెక్టర్ తో ప్రకాష్ రాజ్ ను లాక్ చేస్తుంటాడు దిల్ రాజు. అలా దిల్ రాజు బ్యానర్ లో ఎప్పుడూ మంచి పాత్రలే దక్కించుకున్నాడు ప్రకాష్ రాజ్. తాజాగా శతమానం భవతి సినిమా టీజర్ లో కూడా ప్రకాష్ రాజ్  గెటప్, లుక్స్ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేశాయి.