ఈ వేగాన్ని ఆపేదెవరు...?

Thursday,October 13,2016 - 06:03 by Z_CLU

టీజర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. టీజర్ చూసిన వాళ్ళలో రెస్పాన్స్ చూస్తే సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం అయిపోతుంది. తమిళంలో సూపర్ హిట్టయిన తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవ టీజర్ కి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే, సినిమా భవిష్యత్తుపై క్లారిటీ ఆల్ మోస్ట్ వచ్చేసింది.

druva

మంచి మాస్ కంటెంట్ ఉన్న కాన్సెప్ట్, రామ్ చరణ్ లాంటి ఆల్ రౌండర్ హీరో, సురేందర్ రెడ్డి లాంటి స్టైలిష్ డైరెక్టర్ చేతికి చిక్కితే ఏం జరుగుతుంది..? అదే జరిగింది… విజయ దశమి సందర్భంగా రిలీజైన ధృవ టీజర్, కేవలం 48 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

రామ్ చరణ్ స్టైలిష్ లుక్ తో పాటు, దూసుకుపోతున్నట్టుండే డైలాగ్స్, రోజు రోజుకీ ధృవ సినిమా పట్ల క్యూరాసిటీని పెంచేస్తున్నాయి.