అఫీషియల్ : నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్

Sunday,April 15,2018 - 09:10 by Z_CLU

నాగ్, నాని కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా ఫిక్స్ అయింది.  ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

అవసరాల శ్రీనివాస్‌, సంపూర్ణేష్‌బాబుతో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు  మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం మాటలు అందిస్తున్నారు.