సుకుమార్ నెక్స్ట్ సినిమా హీరో గురించి చెప్పేసాడు

Sunday,April 15,2018 - 10:08 by Z_CLU

ప్రస్తుతం ‘రంగస్థలం’ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన నెక్స్ట్ సినిమాపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశాడు. జీసినిమాలు ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ లో  నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉంటుందని తెలియజేశాడు సుక్కు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేయబోతున్నట్లు మరోసారి ప్రకటించాడు.

సో నిన్నటి వరకూ సుకుమార్ మరోసారి మహేష్ ను  డైరెక్ట్ చేయబోతున్నాడంటూ  వినిపించిన వార్త నిజమైంది. ‘1 నేనొక్కడినే’ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఉండనుందని సమాచారం.  ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసిన మహేష్ త్వరలోనే వంశీ పైడిపల్లి మూవీ కి షిఫ్ట్ కానున్నాడు. ఆ సినిమా తర్వాతే మహేష్ సుకుమార్ సినిమా సెట్స్ పైకి వస్తుంది.