'జంబలకడిపంబ' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నరేష్

Sunday,April 15,2018 - 08:40 by Z_CLU

జంబ‌ల‌కిడి పంబ‌` అనే పేరు విన‌గానే న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి హీరోగా నటించాడు.  శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని నాటి `జంబ‌ల‌కిడి పంబ‌` హీరో డా. వి.కె.న‌రేశ్ హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ” బ‌హుశా `జంబ‌లకిడి పంబ‌` అనే టైటిల్ ఒక‌టి వ‌స్తుంద‌ని కూడా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. ఇలాంటి టైటిల్ మ‌ళ్లీ ఇంకో సినిమాకి పెడ‌తార‌ని కూడా అనుకోరు. నేను చాలా ఇష్టంతో స‌త్యం అని పిలుచుకునే మా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ సృష్టించిన అద్భుత కావ్యం `జంబ‌ల‌కిడి పంబ‌`. ఈ చిత్రాన్ని తెలుగు సినిమాల్లో ఆణిముత్యం అని చెప్ప‌వ‌చ్చు.   నేను న‌టించిన సినిమా టైటిల్‌తో.. శ్రీనివాస రెడ్డి హీరోగా చేస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేయ‌డం హ్యాపీగా ఉంది.. చిత్ర‌ యూనిట్‌కి కంగ్రాట్స్“ అని చెప్పారు.

ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌ నిర్మిస్తున్న ఈ కామెడి ఎంటర్ టైనర్ సినిమాకు గోపీసుంద‌ర్‌ సంగీత  దర్శకుడు.