మధు నందన్ ఇంటర్వ్యూ

Wednesday,April 04,2018 - 02:54 by Z_CLU

‘ఛల్ మోహన్ రంగ’ రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నటించిన మధునందన్ ఈ సినిమా గురించి ‘జీ సినిమాలు’తో ఎక్స్ క్లూజివ్ గా చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆ విశేషాలు మధు మాటల్లోనే…

క్యారెక్టర్ గురించి

ప్రతి సినిమాలో నా క్యారెక్టర్ కామెడీగా ఉంటుంది. కానీ ‘ఛల్ మోహన్ రంగ’ లో కథకి ఉపయోగపడుతూనే ఎమోషనల్ గా ఉండే పాత్ర చేశాను. నేను చేసిన మిగతా సినిమాలకు ఈ సినిమాకు క్యారెక్టర్ పరంగా చాలా వేరియేషన్ ఉంటుంది. సినిమాలో నా క్యారెక్టర్ పేరు విలాస్… ఎలా ఎంటర్ చేశానో స్క్రీన్ పై చూడాల్సిందే.

వారిద్దరికీ కామన్ ఫ్రెండ్ 

నితిన్,  దర్శకుడు కృష్ణ చైతన్య కి నేను కామన్ ఫ్రెండ్.. నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుండో కోరుకుంటున్నా ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది. ఫ్రెండ్స్ తో కలిసి నేను కూడా ఈ సినిమాలో ఓ పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. నన్ను నమ్మి సినిమాలో నాకో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు వారిద్దరికీ థాంక్స్.

 

నితిన్ తో 18 ఏళ్ల అనుబంధం

నేను నటించిన మొదటి సినిమా ‘నువ్వు నేను’ ఆ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ గారు  డిస్ట్రిబ్యూటర్ కావడంతో అప్పుడే నితిన్ నాకు పరిచయమయ్యాడు. దాదాపు 18 ఏళ్ల అనుబంధం మాది. అప్పటి నుండి ఇప్పటి వరకూ మా రిలేషన్ షిప్ లో ఎలాంటి మార్పు లేదు. ఆ అనుబంధంతోనే నితిన్ ప్రతీ సినిమాలో కనిపిస్తుంటాను. ఇన్నేళ్ళుగా నితిన్ తో ట్రావెల్ చేయడం నా అదృష్టం.

 

చైతన్య లో చేంజ్ కనిపించింది

కృష్ణచైతన్య డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ‘రౌడీఫెలో’ లో ఓ క్యారెక్టర్ చేశాను. అంతకు ముందే చైతూతో నాకు పరిచయం. ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ దర్శకుడిగా చాలా మారాడు. కొంచెం సినిమా మీద నాలెడ్జ్ పెరిగింది. ఆ మార్పు ప్రతి సీన్ లో గమనించాను.


ఈ సారి గట్టిగా కొడతాడు

ఈ కథ చెప్పినప్పటి నుండి సినిమా ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తుందనిపించింది. చైతన్య కృష్ణ తను అనుకున్న కథను చాలా బాగా తీశాడు. అతని మీద మా అందరికీ చాలా నమ్మకం ఉంది. ఈ సారి గట్టిగా కొడతాడు.

పేరు వినగానే షాక్ అయ్యాను

ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ తో కలిసి త్రివిక్రమ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని ముందు నుండి తెలుసు. కానీ సడెన్ గా పవన్ కళ్యాణ్ గారి పేరు విని షాక్ అయ్యాను. ఆయన ఈ సినిమా నిర్మాతగా వ్యవహిస్తారని అస్సలు ఊహించలేదు. అందరం కలిసి ఉన్నప్పుడే నితిన్ ఈ విషయాన్నీ చెప్పాడు. ముందు షాక్ అయ్యి తర్వాత ఆనందపడ్డాం.

 

60 నుండి 70 సినిమాలు

నువ్వు నేను సినిమాతో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసాను. ఆ సినిమా నుండి  వచ్చిన ప్రతి క్యారెక్టర్ వదలుకోకుండా చేసాను. అప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 60 నుండి 70 సినిమాల్లో నటించాను.

 

ఆ ఆలోచనే లేదు

కమెడియన్ నుండి హీరో అవ్వాలనే ఆలోచన లేదు. నటుడిగా నాకు వచ్చిన క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తా. కమెడియన్ కంటే ఎమోషనల్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. అలాంటి క్యారెక్టర్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ఉంది.

వారిద్దరూ నా ఫేవరేట్

డైరెక్టర్స్ లో రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారంటే చాలా ఇష్టం. ఇద్దరి డైరెక్షన్ లో నటించాను. కెరీర్ స్టార్టింగ్ లోనే రాజమౌళి గారి డైరెక్షన్ లో ‘సై’ సినిమా చేసాను. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ‘S/O సత్యమూర్తి ‘,’ అ ఆ’ సినిమాలు చేసాను. లేటెస్ట్ గా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో IPL యాడ్ లో కూడా తారక్ తో కలిసి నటించాను. వారిద్దరితో కలిసి పనిచేయడం ప్రతీ నటుడికి ఓ కల. నా కల నేరవేరిపోయింది.

నా హోం బ్యానర్

నిజానికి శ్రేష్ట్ మూవీస్ అంటే నా హోం బ్యానర్ లా ఫీలవుతాను. సుధాకర్ రెడ్డి గారు, నిఖిత గారు గారితో మంచి అనుబంధం ఉంది. ఈ బ్యానర్ లో వచ్చే ప్రతీ సినిమాలో నాకో క్యారెక్టర్ ఉంటుంది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి గారికి నిఖితా గారికి నా థాంక్స్.

ఆ సాంగ్ నా ఫేవరేట్

ఆల్బం పరంగా నాకు ‘మియామి’ సాంగ్ బాగా ఇష్టం. స్క్రీన్ పై మాత్రం పెద్దపులి సాంగ్ ఇష్టం. థమన్ పెద్దపులిలా విరుచుకుపడ్డాడు. ఈ ఏడాది తమన్ పట్టిందల్లా బంగారంలా ఉంది. ఈ సినిమాకు సంబంధించి బెస్ట్ ఆల్బం ఇచ్చాడు. సినిమాలో సాంగ్స్ హైలైట్ గా నిలుస్తాయి.


ప్రీ క్లైమాక్స్ అలా ఉంటుంది

సినిమాలో నేను బాగా ఎంజాయ్ చేసింది ప్రీ క్లైమాక్స్ సీన్స్ కే. సినిమా మొత్తం సరదాగానే ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తాయి. అలాగే యు.ఎస్ లో నితిన్-నాకు మధ్య వచ్చే కామెడి కూడా ఎంటర్టైన్ చేస్తుంది.

 

పోస్ట్ రిలీజ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి 

రిలీజ్ కి ముందు టూర్ ద్వారా ఆడియన్స్ ను మీట్ అవ్వడం మా టీం అందరికీ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అందరు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా..అనే క్యూరియాసిటీ తో ఉన్నారు. రిలీజ్ తర్వాత కూడా కొన్ని ప్రమోషన్స్ ప్లాన్ ఉంది. రిలీజ్ తర్వాత సినిమా ఎలా ఎంటర్ టైన్ చేసిందో ఆడియన్స్ దగ్గరకి వెళ్లి తెలుసుకుంటాం.

ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్..ఎంటర్టైన్మెంట్

ఈ సినిమాకు సంబంధించి నేను చెప్పేది ఒక్కటే ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్..ఎంటర్టైన్మెంట్. సినిమా అందరు చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ముఖ్యంగా యూత్ కి కనెక్ట్ అవుతుంది.