Ramarao On Duty - ఆ సీక్వెన్స్ హైలైట్ కానుందా?

Friday,January 28,2022 - 06:53 by Z_CLU

Action sequences are the major highlights in Raviteja’s Ramarao On Duty

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘Ramarao on duty’ కి సంబంధించి సినిమాలో హైలైట్ కానున్న ఈ సీక్వెన్స్ ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది. అవును సినిమాలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్ లు బాగానే ఉన్నాయట. అందులో ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

తాజాగా టీం రవితేజకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ట్రైన్ సీక్వెన్ కి సంబంధించి స్టిల్స్ చూపించారు. ఆ స్టిల్స్ ని బట్టి చూస్తే సినిమాకు ఈ యాక్షన్ పార్ట్ మేజర్ ఎట్రాక్షన్ అనిపిస్తుంది. మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో రవితేజ యాక్షన్ అల్టిమేట్ గా ఉంటుంది. తాజాగా వచ్చిన క్రాక్ లో యాక్షన్ ఎపిసోడ్స్ లో రెచ్చి పోయి మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు రవితేజ.

అయితే ఇప్పుడు రామారావు సినిమాలో కూడా అదే రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టబోతున్నాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బేనర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శరత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తు ఈ సినిమాకు సామ్ CS మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మార్చ్ 25 సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ramarao on duty