ప్రశంసల జల్లు

Sunday,October 09,2016 - 10:15 by Z_CLU

తమన్న, ప్రభుదేవా, సోను సూద్ నటించిన ‘అభినేత్రి’ భారీ అంచానాలు మధ్య ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ శుక్రవారం విడుదలైంది… అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హారర్ కామెడీని ప్రధానంగా ఎలివేట్ చేయడంతో పాటు… చివర్లో ఓ మంచి సందేశం ఇవ్వడం అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేసింది.
karthi-capture prabhu-deva-tweet
ఓ చక్కని సందేశం తో కూడిన హార్రర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా థియేటర్స్ లో నవ్వులు పూవులు పూయిస్తుంది. ట్రైలర్ తో అందరిలో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమాలో కొన్ని హారర్ సన్నివేశాలతో పాటు కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. విమర్శకులను సైతం ఆకట్టుకుంటుంది. ఇక తెలుగుతో పాటు,తమిళ్, హిందీలో ఒకేసారి విడుదలైన ‘అభినేత్రి’ పై సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. చిత్ర టీం కూడా తమ ఆనందాన్ని అదే వేదికా ద్వారా పంచుకుంటోంది. మరోవైపు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.