ఫస్ట్ లుక్ విడుదల

Saturday,October 08,2016 - 07:09 by Z_CLU

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ధృవనక్షత్రం, సందీప్ కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ, ప్రగ్యా జైస్వాల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్… ధృవనక్షత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. ప్రస్తుతం తన కొత్త సినిమా ధృవ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చెర్రీ.,,, తన సినిమా సెట్స్ లోనే ధృవనక్షత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు.

nakshatram

 రామ్ చరణ్, కృష్ణవంశీ మధ్య మంచి బాండింగ్ ఉంది. చెర్రీ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమాకు కృష్ణవంశీనే దర్శకుడు. ఆ సినిమా టైం నుంచి కృష్ణవంశీ, చరణ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ అభిమానంతోనే ఇప్పుడు కృష్ణవంశీ డైరక్ట్ చేసిన ధృవనక్షత్రం సినిమా ఫస్ట్ లుక్ ను చరణ్ విడుదల చేశాడు, ఇకపై వరుసగా ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదల చేయబోతున్నారు.