Chiranjeevi Bholaa Shankar - రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,August 22,2022 - 03:28 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ “’భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదల తేది ఖరారైంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రిలీజ్ డే ‘శుక్రవారం’ అంబేద్కర్ జయంతి పబ్లిక్ హాలీడే. దాని తర్వాత వీకెండ్ సెలవులు వస్తాయి. అంటే బాక్సాఫీస్‌ వద్ద మూడు రోజుల పాటు మెగా ర్యాంపేజ్‌ ఖాయం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘భోళా శంకర్’ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటన చేశారు.

పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్ గా నడుస్తూ ట్రైడెంట్ కీచైన్‌ ని తిప్పుతూ మెగా స్తయిలీష్ గా కనిపించారు. భోలా శంకర్ ఇప్పటివరకు 40శాతం పూర్తయింది. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రతిష్టాత్మకంగా తతెరకెక్కుతోంది.

ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది..

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Chiranjeevi Bholaa Shankar (1)