కొత్త సినిమాకు 'క్లాప్' కొట్టిన ఆది

Wednesday,June 12,2019 - 12:00 by Z_CLU

ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు ‘క్లాప్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెలుగు, తమిళ్ లో బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఆది సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించనుంది.

కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని, రీసెర్చ్ లు చేసి ఈ కథను రెడీ చేసుకున్నానని, కచ్చితంగా ఈ సినిమా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని దర్శకుడు ఆదిత్య తెలిపాడు.

సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తానని , అందులో ఒకటి ఎక్స్ కోచ్ మరొకటి ఫ్లాష్ బ్యాక్ లో కోచ్ అని, ఫ్లాష్ బ్యాక్ లో కోచ్ గా కనిపించేందుకు ఒక షెడ్యుల్ తర్వాత  రన్నింగ్ లో ట్రైనింగ్ తీసుకోనున్నానని హీరో ఆది తెలిపాడు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జూన్ 19 నుండి సెట్స్ పైకి రానుంది. చెన్నై లో ఒక షెడ్యుల్ పూర్తి చేసి తదుపరి షెడ్యుల్స్ హైదరాబాద్, మదురై, బెంగుళూరులో ప్లాన్ చేస్తున్నారు.