నితిన్ సూపర్ హిట్ సినిమాకు రెండేళ్లు

Saturday,June 02,2018 - 03:21 by Z_CLU

అ..ఆ.. సినిమా టైటిల్ మాత్రమే కాదు, సినిమా కూడా ఎంతో ప్రత్యేకం. ఇప్పటివరకు నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇదే. అలా అని కేవలం దీన్నొక సూపర్ హిట్ సినిమాగా మాత్రమే చూడ్డానికి వీల్లేదు.

ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగుప్రేక్షకులకు తెలుగుదనాన్ని, పచ్చదనాన్ని మరోసారి పరిచయం చేసింది ఈ సినిమా. మరెన్నో ఇలాంటి కుటుంబకథా చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమను ఒక అందమైన దృశ్యకావ్యంగా మలిచాడు.

2016లో విడుదలైన ఈ సినిమా ఇవాళ్టితో సరిగ్గా రెండేళ్లు పూర్తిచేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ అనసూయ రామలింగం, ఆనంద్ విహారి పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.