సోషల్ మీడియాలో "అ..ఆ" రికార్డు

Wednesday,April 19,2017 - 12:35 by Z_CLU

ఎప్పుడో లాస్ట్ ఇయర్ జూన్ 2 న రిలీజైంది అ..ఆ సినిమా. కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం ఇంకా తగ్గలేదు. యూత్, మాస్ అని తేడా లేకుండా మ్యాగ్జిమం క్యాటగిరీస్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా వీడియో సాంగ్స్, ఇంకా యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ‘యా..యా…” అనే సాంగ్ యూట్యూబ్ ను ఓ ఊపు ఊపుతోంది. ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ పాటని అభయ్ జోధ్ పుర్కార్, చిత్ర, అంజనా సౌమ్య, సాయి శివాని కలిసి పాడారు.

లవర్ బాయ్ గా మ్యాగ్జిమం సెటిల్ అయిపోయిన నితిన్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ గా నిలిచింది.

S.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా నటించింది. అల్టిమేట్ ఫ్యామిలీ వాల్యూస్ తో, బోలెడన్ని ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మరిన్ని ఫ్యామిలీ బేస్డ్ సినిమాలకు ఇన్స్ పిరేషన్ గా నిలిచింది.