మళ్లీ ప్రారంభం కానున్న కమల్ సినిమా

Saturday,June 02,2018 - 03:41 by Z_CLU

ప్రస్తుతం కమల్ హాసన్ కు సంబంధించి 2 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో విశ్వరూపం-2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంటే.. శభాష్ నాయుడు సినిమా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. అలా ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నుంచి శభాష్ నాయుడు కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తానని చెబుతున్నాడు కమల్ హాసన్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికాలో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది.

అలా ఆగిపోయిన సినిమాను మళ్లీ మొదలుపెడతానంటున్నాడు కమల్. విశ్వరూపం-2 పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన వెంటనే శభాష్ నాయుడు అప్ డేట్స్ ఎనౌన్స్ చేస్తానని ప్రకటించాడు. ఈ సినిమాలో కమల్, శృతిహాసన్ కలిసి నటిస్తున్నారు. బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక కామెడీ ఎంటర్ టైనర్.