జంబలకిడిపంబ ప్రోమో సాంగ్

Saturday,June 02,2018 - 03:03 by Z_CLU

జంబలకిడిపంబ మూవీ ప్రమోషన్ ఊపందుకుంది. మొదట్నుంచి ఈ సినిమాకు డిఫరెంట్ గా ప్రచారం కల్పిస్తున్న యూనిట్.. తాజాగా మరో ప్రయత్నం చేసింది. బాలీవుడ్ స్టయిల్ ను ఫాలో అవుతూ ఓ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసింది. సినిమాలో నటించిన కీలకమైన నటీనటులందరితో ప్రోమో సాంగ్ షూట్ చేసి రిలీజ్ చేసింది.

ఇలా ప్రోమో సాంగ్ విడుదల చేయడం ఆడియన్స్ కు బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు.. ఈ ప్రోమో సాంగ్ లోనే సినిమా థీమ్ ఏంటనే విషయాన్ని చూచాయగా బయటపెట్టారు మేకర్స్.

కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న జంబలకిడిపంబ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సిద్ధి హీరోహీరోయిన్లుగా నటించారు. జేబీ మురళీ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు.