#HeyIdiNenena ... 25 మిలియన్!

Wednesday,November 25,2020 - 12:52 by Z_CLU

Sai Dharam Tej హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‘ సినిమాలోని HeyIdiNenena లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇటివలే ఆల్బం నుండి రెండో పాటగా రిలీజైన ఈ సాంగ్ తాజాగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని 50 మిలియన్ వైపుగా దూసుకెళ్తోంది.

Thaman అందించిన ఎనర్జిటిక్ ట్యూన్ కి రఘురాం చక్కని సాహిత్యం అందించాడు. సోలోగా జీవితాన్ని గడిపేయాలనుకునే కుర్రాడి జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తన పదాలతో లిరిక్స్ అందించి సాంగ్ ను యువతకు కనెక్ట్ చేసాడు రఘు. ఇక ఇటివలే తన గొంతుతో చాలా పాటలు సూపర్ హిట్ చేసిన  Sid Sreeram వాయిస్ కూడా సాంగ్ కి హైలైట్ అని చెప్పొచ్చు.

ఇప్పటికే ఆల్బం నుండి మూడు పాటలు రిలీజయ్యాయి. త్వరలోనే మిగతా పాటలను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జీ సంస్థ ద్వారా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.