సాయి ధరమ్ తేజ్

Friday,December 11,2020 - 03:00 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ ప్రముఖ కథానాయకుడు. అక్టోబర్ 15, 1986 లో జన్మించారు. సాయి ధరమ్ తేజ్ ప్రముఖ కథానాయకులు మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు. ‘రేయ్’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు వై.వి.ఎస్ చౌదరి దర్శకుడు. ఈ సినిమా తరువాత ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో నటించారు. ఈ సినిమా ముందు విడుదల కాగా ‘రేయ్’ రెండో సినిమాగా విడుదలైంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ కథానాయకుడిగా సాయి ధరమ్ తేజ్ కు మంచు గుర్తింపు అందించింది. ఈ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ హీరో కేటగిరి లో సైమా అవార్డు అందుకున్నారు. తరువాత హరీష్ శంకర్ దర్శకత్వం లో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటించిన సాయి ధరమ్ తేజ్ మరో విజయం అందుకున్నారు. ‘సుప్రీం’ సినిమాతో కథానాయకుడిగా గ్రాండ్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత ‘తిక్క’ సినిమాలో నటించిన సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా ‘విన్నర్’  ‘నక్షత్రం’ ,’ఇంటెలిజెంట్’, ‘ప్రతి రోజు పండగే’,’సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలు చేసాడు.

Born : 15 October 1986
Zodiac : Libra
Height : 5.8 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు