2021 మెగా ఇయర్ !

Monday,February 08,2021 - 02:58 by Z_CLU

ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ కి మర్చిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నారు మెగా హీరోస్. అవును 2021 ని మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోల నుండి సినిమాలు రాబోతున్నాయి. వచ్చే వారం నుండే  మెగా సందడి మొదలవుతుంది.

ఫిబ్రవరి 12న వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ థియేటర్స్ లోకి వస్తుంది. ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమ్ముడు థియేటర్స్ లోకొచ్చిన నెల రోజులకే అన్నయ్య మెగా స్టార్ ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక జూన్ 4న సాయి ధరమ్ తేజ్  ‘రిపబ్లిక్’ జులై 30న వరుణ్ తేజ్ ‘గని’ విడుదల అవుతున్నాయి.

ఆగస్ట్ లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ రాజ్ గా వస్తుంటే అక్టోబర్ 13 న రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ‘RRR’ తో మెగా ఫ్యాన్స్ ని పలకరించనున్నాడు. RRR తో పాటే ఆచార్య లో కూడా తండ్రి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని ఫ్యాన్స్ ని ఖుషీ చేయబోతున్నాడు చరణ్. అలాగే వరుణ్ కూడా ఆగస్ట్ 27 ‘F3’ సినిమాతో మరోసారి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వీటితో పాటు క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ చేస్తున్న సినిమా సాయి ధరమ్ ఇంకో సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

ఇలా ఫిబ్రవరి నుండి ఏడాది చివరి వరకు మెగా సినిమాలు రానున్నాయి. మరి ఈ మెగా మూవీస్ ఎలాంటి హిట్స్ అందుకుంటాయో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి వసూళ్లు రాబడతాయో చూడాలి.

Also Read నాలుగు సినిమాతో యంగ్ మెగా బ్రదర్స్