వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

Monday,February 08,2021 - 03:40 by Z_CLU

మెగా ఫ్యామిలీ నుండి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తో హీరోగా పరిచయమవుతున్నాడు. మొదటి సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా హీరో మీడియాతో ముచ్చటించాడు. డెబ్యూ సినిమా గురించి వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే…

డెస్టిని డిసైడ్ చేసింది

చాలా ఏళ్ళు నా కెరీర్ ఏంటనేది అర్థం కాలేదు. రకరకాల ఆలోచనలతో ముందుకు సాగాను. చదువుకునే రోజుల్లో సైంటిస్ట్ అవ్వలనుకున్నా. ఆ తర్వాత ఫోటోగ్రఫీ, 3d అనిమేషన్ నేర్చుకోవాలనుకున్నా.  ఒక టైంలో ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనుకున్నాను. కానీ డెస్టిని నన్ను సినిమా వైపుకు నడిపించింది.

ఇన్స్టా పోస్ట్ తో ‘ఉప్పెన’  

ఒక టైంలో ఇన్స్టాగ్రామ్ నాది ఒక ఫోటో పోస్ట్ చేశాను. అది చూసి రెండు మూడు ఆఫర్స్ వచ్చాయి. కానీ ఎవరూ కథతో అప్రోచ్ అవ్వలేదు.  బుచ్చి గారు ప్రాపర్ స్క్రిప్ట్ తో వచ్చి ఫుల్ నెరేషన్ ఇచ్చారు. కథ వినగానే బాగా నచ్చింది. తర్వాత పెద్ద మావయ్య కూడా కథ వినడం ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫైనల్ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది.

బొమ్మల కోసమే 

చిన్నప్పుడు పవన్ మావయ్య సినిమాలో చేస్తావా ? అని అడిగి చేస్తే బొమ్మలు కొనిస్తా అన్నారు. అలా ‘జానీ’ సినిమాలో చిన్న రోల్ చేశా. షూట్ అయ్యాక మావయ్య నాకు చాలా బొమ్మలు కొనిచ్చారు. తర్వాత పెద్ద మావయ్య శంకర్ దాదా MBBS లో వీల్ చెయిర్ లో కూర్చోబెట్టి ఒక పేషంట్ రోల్ చేశాను. అప్పుడు నాకు  సినిమా గురించి పెద్దగా ఏమి తెలియదు. కేవలం మావయ్య చెప్పిన మాట విని ఆ రోల్స్ చేశా.

ఊహించని డెబ్యూ

నా మొదటి సినిమాకి ఇంత పెద్ద సపోర్ట్ లభిస్తుందని గానీ ఈ రేంజ్ఎంకరేజ్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. మొదటి సినిమానే ఒక పెద్ద బేనర్ లో చేయడం , సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సపోర్ట్ ఉండటం , వెర్సటైల్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, దేవి మ్యూజిక్ వీటన్నికి మించి గొప్ప కథ దొరకడం నా అదృష్టం అనుకుంటున్నా.

తారక్ అన్న ఇంటికి రమ్మన్నారు 

ఎన్టీఆర్ అన్న ముందు నుండి చాలా సపోర్ట్ చేసే వారు. ఒక టైంలో ఫ్రెండ్స్ తో ఔటింగ్ వెళ్తే నాకు కాల్ చేసి అర్జెంట్ గా ఇంటికి రమ్మని పిలిచాడు. ఆ టైంలో నా గురించి అన్న చెప్పిన మాటలు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేను. నా ఫస్ట్ ఫిలిం ట్రైలర్ ను తారక్ అన్న లాంచ్ చేసినందుకు ఇంకా హ్యాపీ గా ఫీలయ్యాను.

 డేట్స్ లేవన్నారు 

‘ఉప్పెన’లో బచ్చిగారు విలన్ గా విజయ్ సేతుపతి గారిని అనుకుగానే ఆయన రెండేళ్ళు డేట్స్ లేవని కానీ సుకుమార్ గారి మీద రెస్పెక్ట్ తో కథ మాత్రం వింటానని చెప్పారు. బుచ్చి గారు వెళ్లి కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తున్నా అని చెప్పేసి డేట్స్ అడ్జస్ట్ చేశారు. ఉప్పెన కి డేట్స్ ఇవ్వడం కోసం ఆయన రాత్రి పగలు వర్క్ చేసారు. ఆయన నుండి ఎన్నో నేర్చుకున్నాను. నటుడిగా ఎదగటానికి చాలా టిప్స్ ఇచ్చారు. షూట్ చివరి రోజు క్రూ అందరినీ పిలిచి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయిలు ఇచ్చారు. ఆ విషయం నన్ను చాలా ప్రభావితం చేసింది.

చాలా డెడికేటెడ్ 

కృతి చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్. సీన్ అయ్యాక కూడా ఆ పాత్రలో ఉన్నట్టు ఉండేది. తన రోల్ ని చాలా సిన్సియర్ గా చేసింది. రిలీజ్ తర్వాత తనకి చాలా మంచి పేరొస్తుంది.

చిరు మావయ్య అదే అన్నారు 

ఒక టైంలో ఆఫర్స్ వస్తున్నాయి కానీ నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదని పెద్ద మావయ్యతో చెప్పాను. ఒకసారి ప్రయత్నించి చూడు నీవల్ల అవ్వకపోతే వదిలేయ్. కానీ వచ్చిన అవకాశాన్ని గౌరవించు అన్నారు. ఆ మాట నా మైండ్ లో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యింది. ఉప్పెన సినిమా చేయడానికి మెయిన్ రీజన్ చిరు మావయ్యే.

పవన్ మావయ్య రియాక్షన్ అదే 

పవన్ మావయ్య ఇంకా సినిమా చూడలేదు. రీసెంట్ గా ట్రైలర్ చూసి అందరి వర్క్ గురించి మాట్లాడారు. అందరినీ మెచ్చుకొని ట్రైలర్ బాగుంది ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకుంటాయి.

రైటింగ్ కి ఎక్కువ పేరొస్తుంది 

బుచ్చి గారు మంచి రైటర్. ఈ సినిమాతో ఆయనకి దర్శకుడిగా ఎంత పేరు వస్తుందో అంట కంటే రైటర్ గా ఇంకా ఎక్కువ పేరొస్తుంది. తను నమ్మిన కథను చాలా గొప్పగా తీసి నన్ను హీరోగా మార్చారు.

చాలా సార్లు చూసుకున్నా 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకి కష్టపడిన ప్రతీ ఒక్కరిని గుర్తుపెట్టుకొని అందరి గురించి మాట్లాడి థాంక్స్ చెప్పాలనుకున్నా. కానీ స్టేజి పైకి వెళ్లేసరికి మర్చిపోతానేమో అనుకున్నా. బట్ ఎవ్వరిని మర్చిపోలేదు. ఫంక్షన్ అయ్యాక నా స్పీచ్ పదే పదే చూసుకొని ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడింది నేనేనా ? అనుకున్నా.

మన మట్టి కథ 

ఉప్పెన మన మట్టి కథ. మంచి ప్రేమకథతో పాటు స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది.సినిమా చూసి అందరు మంచి సినిమా చూశామని కచ్చితంగా ఫీలవుతారు. ఇప్పుడు కథ గురించి చెప్పలేను కానీ రిలీజ్ తర్వాత ఇది ఎంత గొప్ప కథో అందరికి తెలుస్తుంది.