అన్నదమ్ములు @ 4 సినిమాలు !

Wednesday,February 03,2021 - 12:21 by Z_CLU

మెగా ఫ్యామిలీ నుండి ఈ ఏడాది దాదాపు పది సినిమాలు థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే. అందులో మెగా మేనల్లళ్ళ సినిమాలే నలుగు ఉండటం విశేషం. అవును సాయి తేజ్ అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ నుండి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ఈ నెలలో వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన‘ రిలీజవుతోంది. ఆ వెంటనే క్రిష్ సినిమాతో ఎక్కువ గ్యాప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ -క్రిష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

ఇక దేవకట్టా డైరెక్షన్ లో సాయి తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్‘ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఈ సినిమాతో ఈ ఏడాది జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ్ 2021 చివర్లో కార్తీక్ దండుతో SVCC , Sukumar Writings సంస్థలతో కలిసి చేస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ సినిమాతో రానున్నాడు. అంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈసారి డబుల్ ఎనర్జీతో నాలుగు సినిమాలు అందించబోతున్నారు. మరి ఈ  మెగా యంగ్ బ్రదర్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు నమోదు చేస్తారో చూడాలి.

Also Check స్టార్ట్ హీరోలొస్తున్నారు