Narudi brathuku natana - మరో డిఫరెంట్ మూవీ

Monday,February 08,2021 - 12:33 by Z_CLU

టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ నాయికగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తోంది.

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ, దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల తో సినిమా నుంచి ఓ వీడియోను విడుదల చేసింది యూనిట్.

మరో కొత్త కథతో, సిద్ధు మరో డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడనే విషయం ఈ వీడియో చూస్తే అర్థమౌతుంది. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు.