రెండేళ్ల గ్యాప్.. 2 సినిమాలు

Friday,March 13,2020 - 03:32 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరిగ్గా రెండేళ్లు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడీ రెండేళ్ల గ్యాప్ ను బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ఫిల్ చేయబోతున్నాడు. అలా ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు పవన్.

పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. దిల్ రాజు బ్యానర్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయబోతున్నారు. సినిమాకు సంబంధించి ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ మాత్రమే పెండింగ్ ఉంది.

ఇక ఇదే ఏడాది పవన్ నుంచి మరో సినిమా కూడా రాబోతోంది. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. పవన్ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో వస్తోంది ఈ సినిమా. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయబోతున్నాడు పవన్. కుదిరితే నవంబర్ లో, లేదంటే డిసెంబర్ లో క్రిష్ మూవీ రిలీజ్ చేయాలనేది ప్లాన్.

ఇలా ఒకే ఏడాది 2 సినిమాలు రిలీజ్ చేసి గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు పవర్ స్టార్.