అనుష్కకు ఆ పేరుపెట్టింది ఎవరు?

Friday,March 13,2020 - 12:55 by Z_CLU

టాలీవుడ్ బొమ్మాలి అనుష్క అసలు పేరు స్వీటీ షెట్టి. తెరపై మాత్రమే ఆమె అనుష్క. ఇంతకీ ఆమెకు ఆ పేరు పెట్టింది ఎవరు? ఈ ఇంట్రెస్టింగ్ మేటర్ ను దర్శకుడు పూరి జగన్నాధ్ బయటపెట్టాడు.

“సూపర్ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ సందీప్ చౌతా ‘మిల మిల మిల’ అనే పాట రికార్డింగ్ కోసం ఒక అమ్మాయిని పిలిపించాడు. ఆ అమ్మాయి పేరు అనుష్క‌. అది నాకు న‌చ్చి, ‘ఈ పేరు ఎలా ఉంది?’ అని స్వీటీని అడిగాను. ‘బాగానే ఉంది కానీ, నాగార్జున‌ గారిని కూడా అడుగుదాం’ అంది. ఆయ‌న్ని అడిగితే, మ‌న హీరోయిన్ల‌లో ఎవ‌రికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చ‌న్నారు. అలా అనుష్క అనే నామ‌క‌ర‌ణం జ‌రిగింది.”

ఇలా అనుష్కకు తనే పేరుపెట్టిన విషయాన్ని బయటపెట్టాడు పూరి జగన్నాధ్. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రాత్రి ఓ చిన్న ఫంక్షన్ ఏర్పాటుచేశారు. అనుష్కను డైరక్ట్ చేసిన దర్శకులంతా ఈ ఫంక్షన్ కు వచ్చారు. అనుష్కతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.