WWW - కేవీ గుహన్ దర్శకత్వంలో మరో మూవీ

Wednesday,December 16,2020 - 12:46 by Z_CLU

`118` వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ త‌న నెక్ట్స్ మూవీకి మ‌రో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ని సెలక్ట్ చేసుకున్నాడు.. ఈ చిత్రానికి WWW (Who.. Where.. Why) అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.

అదిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి, పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. త్వ‌ర‌లో ఈ చిత్రం టైటిల్‌ లోగోను రిలీజ్ చేస్తారు.

సిమ‌న్ కె. కింగ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా హై-లెవెల్ లో ఉంటుందంటోంది యూనిట్.

హీరోహీరోయిన్లు: అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్

సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
డైలాగ్స్‌: మిర్చికిర‌ణ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దట్ల‌,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు ద‌ట్ల ,
క‌థ‌, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కేవి గుహ‌న్‌.