WWW First Look - రానా మెచ్చిన పోస్టర్
Tuesday,January 12,2021 - 03:30 by Z_CLU
`118` వంటి హిట్ చిత్రాన్నితెరకెక్కించిన దర్శకుడు కేవి గుహన్ (ప్రముఖ సినిమాటోగ్రాఫర్) రెండో చిత్రంగా తెలుగు, తమిళ భాషలలో రూపొందిస్తోన్నమిస్టరి థ్రిల్లర్ `WWW`(ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు ధాట్ల నిర్మిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలచేసిన ప్రీ-లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ని వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్చేశారు.
చిత్ర దర్శకుడు కేవి గుహన్ మాట్లాడుతూ – “నా ఫస్ట్ మూవీ 118 తర్వాత నెక్ట్స్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు లాక్డౌన్లో ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని `WWW` సినిమా చేయడం జరిగింది. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. సినిమా చాలా బాగా వచ్చింది. ఔట్పుట్ పట్ల మా టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం. మా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రానా గారికి థ్యాంక్స్. రానా గారు కొత్త తరహా చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి
బ్యానర్: రామంత్ర క్రియేషన్స్,
సంగీతం: సిమన్ కె. కింగ్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఆర్ట్: నిఖిల్ హసన్,
డైలాగ్స్: మిర్చి కిరణ్,
లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్,
కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్,
స్టంట్స్: రియల్ సతీష్,
కాస్ట్యూమ్ డిజైనర్: పొన్మని గుహన్,
ప్రొడక్షన్ కంట్రోలర్: కె. రవి కుమార్,
కో-ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ ధాట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు ధాట్ల,
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్.