Lavanya Tripathi - చావుకబురు చల్లగా

Wednesday,December 16,2020 - 12:57 by Z_CLU

యంగ్ హీరో కార్తీకేయ‌, బ్యూటిఫుల్ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటిస్తున్న సినిమా ‘చావు క‌బురు చ‌ల్లగా’. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక అనే హైద‌రాబాదీ బ‌స్తీ అమ్మాయిగా క‌నిపించ‌నుంది. మ‌ల్లిక‌గా లావ‌ణ్య త్రిపాఠి లుక్ ఇప్ప‌టికే విడుద‌లై అనూహ్య స్పంద‌న అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త లుక్ ని విడుద‌ల చేశారు.

ఇక ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్న యంగ్ హీరో కార్తికేయ… బ‌స్తీ బాలరాజు గెటప్, క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఆకట్టుకునే విధంగా ఉంటాయ‌ని, అలానే లావ‌ణ్య పాత్ర కూడా న్యాచురల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.

lavanya_Tripathi_first_look_chavu_kaburu_Challaga-zeecinemalu 2

నటీనటులు – కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు
స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత – బ‌న్నీ వాసు
ఎడిట‌ర్‌ – స‌త్య జి
ఆర్ట్‌ – జి ఎమ్ శేఖ‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్ – క‌ర‌మ్ ఛావ్లా
మ్యూజిక్ – జేక్స్‌ బిజాయ్
ద‌ర్శకుడు – కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి