'సప్తగిరి ఎక్స్ ప్రెస్' రివ్యూ

Friday,December 23,2016 - 01:26 by Z_CLU

నటీనటులు : సప్తగిరి , రోషినీ ప్రకాష్

ఇతర నటీనటులు : అలీ, శివ ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, షాయాజీ షిండే, అజయ్ గోష్, షకలక శంకర్, హేమ తదితరులు

సినిమాటోగ్రఫీ : సి.రామ్ ప్రసాద్

మ్యూజిక్ : బుల్గానిన్

ఎడిటింగ్ : గౌతంరాజు

నిర్మాత : డాక్టర్ రవికిరణ్

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అరుణ్ పావర్

విడుదల : డిసెంబర్ 23 , 2016

ఆల్ మోస్ట్ చాలా సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో హైలైట్ గా నిలిచిన సప్తగిరి హీరో అయిపోయాడు. కమెడియన్ సప్తగిరి హీరోగా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. ట్రైలర్ తోనే పవర్ స్టార్ ను సైతం ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి కమెడియన్ సప్తగిరి సోలో హీరోగా ఎలా ఎంటర్టైన్ చేసాడో చూద్దాం

 sapthagiri-express-still

కథ :

నిజాయితీ గల కానిస్టేబుల్ శివప్రసాద్ (శివ ప్రసాద్) కొడుకు సప్తగిరి(సప్తగిరి) ఎప్పటికైనా సినిమాల్లో నటించి నటుడు అవ్వాలనుకుంటాడు. కానీ ఓ ఎన్ కౌంటర్ లో తండ్రి చనిపోవడంతో కానిస్టేబుల్ ఉద్యోగం అందుకొని తన కోరిక పక్కన పెట్టి పోలీస్ గా మారతాడు. ఇంతకీ సప్తగిరి తండ్రి శివప్రసాద్ ఎలా చనిపోయాడు ? చివరికి తండ్రిని చంపిన వ్యక్తులపై సప్తగిరి ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది ఈ సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు :

కమెడియన్ సప్తగిరి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో హీరోగా ఎంటర్ టైన్ చేశాడు. రోషిని ప్రకాష్ తన యాక్టింగ్, గ్లామర్ తో ఓకే అనిపించుకుంది. కాణిపాకం క్యారెక్టర్ లో షకలక శంకర్, డాక్టర్ కబాలి క్యారెక్టర్ లో అలీ కామెడీ, జబర్దస్త్ టీం కామెడీ అలరించాయి. ఓ నిజాయితీ గల కానిస్టేబుల్ గా శివప్రసాద్ క్యారెక్టర్ ఆకట్టుకుంది. ఇక పోసాని, షాయాజీ షిండే, అజయ్ గోష్, హేమ, ఝాన్సీ, మధు నందన్, మహేష్ ఆచంట, కార్తీక్ తదితరులు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

ముందుగా ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలంటే సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ గురించి చెప్పాలి. తన సినిమాటోగ్రఫీ తో సినిమాకు ప్లస్ అయ్యాడు రామ్ ప్రసాద్. బుల్గానిన్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా ‘పాప నువ్వు చాలా సూపరే’ ‘వెలుగు చీకటిలో తోడుగా నిలిచే నాన్న’ అనే సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాల్లో వచ్చే కామెడీ డైలాగ్స్ అలరించాయి. ఎడిటింగ్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

sapthagiri-ex-press-still

జీ సినిమాలు సమీక్ష :

సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్న కథ బాగున్నప్పటికీ… ఆ కథతో ఫుల్ లెంగ్త్ గా ఎంటర్టైన్ చేయడంలో కాస్త తడబడ్డాడు దర్శకుడు అరుణ్ పవర్. సప్తగిరితో ఓవైపు కామెడీ చేయిస్తూనే మరోపక్క హీరోయిజం చూపిస్తూ చివరి వరకూ ఆ క్యారెక్టర్ ను నడిపించిన విధానం మాత్రం బాగుంది. ఇక కానిస్టేబుల్ పడే భాధను చూపిస్తూ తెరకెక్కించిన ఎమోషనల్  సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సప్తగిరి షకలక శంకర్ కామెడీ, జబర్దస్త్ టీం కామెడీ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, సప్తగిరి పోలీస్ గా ఎంట్రీ సీన్, సప్తగిరి చెప్పే పౌరాణికాల భారీ డైలాగ్స్, సాంగ్స్, క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు హైలైట్స్. గతంలో సప్తగిరి టైమింగ్ ను, కామెడీ పంచ్ ల్ని ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరూ.. ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. అయితే కథ బాగున్నా స్క్రీన్ ప్లే కాస్త వీక్ అనిపించడం, కొన్ని సీన్స్ బోర్ కొట్టించడం ఈ సినిమాకు మైనస్. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా జస్ట్ వినోదం కోసం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ కు ఒకసారి వెళ్లొచ్చు.

 

రేటింగ్ : 2 .5 / 5