'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ రివ్యూ

Friday,December 16,2016 - 02:45 by Z_CLU

నటీ నటులు : నవీన్ చంద్ర, పృద్వి రాజ్, సలోని, శృతి సోధి

ఇతర నటీ నటులు : జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ :బాల్‌రెడ్డి పి

మ్యూజిక్ : శ్రీవసంత్‌

ఎడిటింగ్ : గౌతమ్‌రాజు

సమర్పణ : శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌

నిర్మాత : కె.కె.రాధామోహన్‌

స్క్రీన్ ప్లే , దర్శకత్వం : ఇ.సత్తిబాబు.

నవీన్‌చంద్ర, పృద్వి, శృతి సోధి, సలోని హీరో హీరోయిన్లుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పై  కె.కె.రాధామోహన్‌ నిర్మించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. కామెడీ ట్రైలర్ తో అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో? చూద్దాం.

meelo-evaru-koteeswarudu-still
కథ :

ఓ సందర్భం లో తన కాలేజ్ లో తన తో కలిసి చదివే ప్రశాంత్(నవీన్ చంద్ర) తో ప్రేమలో పడుతుంది ప్రియ (శృతి సోది). ప్రియ తన ఫామిలీ తో పాటు తనకి కూడా బాగా నచ్చడం తో ప్రశాంత్ కూడా ప్రియను ప్రేమిస్తాడు . వీరిద్దరి ప్రేమను  స్టేటస్ తో ముడి పెట్టి తనకు ఇష్టం లేదని ప్రియ తండ్రి ఏ.బి.ఆర్ (మురళి శర్మ) చెప్పడం తో ఓ బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యి ఆ లాస్ తో జీవితం గురించి చెలుసుకొని చూపించమని ఆ తరువాత మీ నిర్ణయం ఒప్పుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు ప్రశాంత్. ఆ ఛాలెంజ్ ను స్వీకరించిన ఏ.బి.ఆర్ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసాడు? ఆ బిజినెస్ తో ఏం తెలుసుకున్నాడు? ఇంతకీ ఈ బిజినెస్ లో లాస్ ఐడియా తో ప్రశాంత్ ఏం సాధించాడు? అనేది ఈ సినిమా కథాంశం.

నటీ నటుల పనితీరు :

‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయం అయి ఆ సినిమా లో  డిఫరెంట్ క్యారెక్టర్ తో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న నవీన్ చంద్ర ఈ సినిమాలో క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోవడం తో యాక్టింగ్ పరంగా జస్ట్  పరవాలేదనిపించుకున్నాడు. తన కామెడీ పెరఫార్మెన్స్, డైలాగ్స్ తో వేరియేషన్ స్టార్ వీరబాబు గా పృద్వి కామెడీ సినిమాకు హైలైట్. శృతి సోది గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. సలోని నటన బాగుంది. ఏ.బి.ఆర్ గా మురళి శర్మ తన పరిధిలో నటించాడు. సినిమాలు తీసి నష్టపోయిన తోకాడ తాత రావు గా పోసాని కృష్ణ మురళి, వరుస ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ రోల్డు గోల్డ్ రమేష్ గా రఘు బాబు కామెడీ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేశారు. జయప్రకాశ్, చలపతి రావు, ప్రభాస్ శ్రీను , ధన్ రాజ్, భద్రం, మీన, సన తదితరులు తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పని తీరు:

శ్రీ వసంత్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పరవాలేదనిపించాయి. స్పూఫులతో కూడిన కొన్ని కామెడీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Saloni, Prudhvi Raj in Meelo Evaru Koteeswarudu Movie Stills

జీ సినిమాలు సమీక్ష :

కామెడీ సినిమాలతో ఎంటర్టైన్ చేసే డైరెక్టర్ ఇ.సత్తి బాబు ఈ సారి ఓ రొటీన్ స్టోరీ తో రొటీన్ కామెడీ తో కాస్త ఎంటర్టైన్ చేసాడు. ప్రెజెంట్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న పృద్వి క్యారెక్టర్ మీదే సినిమా అంతా సాగింది. నవీన్ చంద్ర హీరో అయినప్పటికి ఒక చిన్న క్యారెక్టర్ ల అనిపించింది. లేటెస్ట్ గా స్టార్ హీరోల డైలాగ్స్ తో, బడా సినిమాల స్పూఫులతో ఎంటర్టైన్ చేసిన పృథ్వి అలాంటి క్యారెక్టర్ తోనే మరో సారి ఎంటర్టైన్ చేసాడు. కానీ కమెడియన్ గా మధ్య మధ్య లో కామెడి సీన్స్ తో ఎంటర్టైన్ చేసే పృథ్వి ఈ సినిమాలో హీరోగా సెకండ్ హాఫ్ అంతా ఫన్నీ గా నడిపించాడు. ఇంటర్వెల్ కి ముందు సూపర్ హిట్ తెలుగు సినిమాల డైలాగ్స్ తో పృథ్వి స్పూఫ్ డైలాగ్స్ సీన్ సినిమాకు మెయిన్ హైలైట్. అలాగే వేరియేషన్ స్టార్ వీరబాబు గా పృథ్వి కామెడీ , శృతి సోది గ్లామర్ సీన్స్, ప్రెజెంట్ సినిమా ఇండస్ట్రీ పై పోసాని రఘు బాబు కామెడీ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు గా పృద్వి, సమంత గా సలోని క్యారెక్టర్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఓవరాల్ గా లాజిక్స్ జోలికెళ్లకుండా కథ లో కొత్తదనం కోరుకోకుండా జస్ట్ కామెడీ కోసం వెళ్తే మాత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఖాయం.

 

రేటింగ్ : 3 /5