పెళ్లి చూపులు రివ్యూ

Thursday,August 04,2016 - 01:56 by Z_CLU

 

చిత్రం : పెళ్లి చూపులు
నటీ నటులు : విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, దర్శి, అభయ్, తదితరులు…
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : నగేష్ బానెల్
కథ,దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాతలు : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని

కథ :-
ప్రశాంత్(విజయ్ దేవరకొండ) జీవితాన్ని చాలా సరదాగా తీసుకుంటూ కాలం వెళ్ళ దీసే ఈ ఇతరం యువకుడు. చదువు అంతగా అబ్బకపోవడంతో చెఫ్ అవ్వాలనుకుంటాడు. అయితే పెళ్ళి చేస్తే ప్రశాంత్ లో మార్పు వస్తుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో తల్లితండ్రులు ప్రశాంత్ కు పెళ్లి చేద్దామని ఫిక్స్ అవుతారు.ఇక జీవితంలో ఓ మహిళగా ఏదో సాధించాలనుకొనే చిత్ర(రీతూ వర్మ) తో పెళ్లిచూపులు ఎరేంజ్ చేస్తారు. అయితే చదువుకునే రోజుల్లోనే ఓ యువకుడితో ప్రేమలో పడి మోసపోయిన చిత్ర కు ఫుడ్ ట్రక్ బిజినెస్ చెయ్యాలని ఉంటుంది.ఇక పెళ్లి చూపుల్లో భాగంగా ప్రశాంత్ కు చిత్ర పరిచయం అవుతుంది. ఆ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. ఇంతకీ చిత్ర ప్రశాంత్ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? చివరికీ వీరిద్దరికి పెళ్లి జరుగుతుందా? లేదా అనేదే ఈ చిత్ర కధాంశం.

నటీనటుల పని తీరు :-
ఈతరం యువకుడిగా ప్రశాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. చిత్ర పాత్రలో రీతూ వర్మ తన గ్లామర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక తెలంగాణ యాస తో కూడిన డైలాగ్ కామెడీ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు దర్శి. అలాగే ప్రశాంత్ స్నేహితుడు విష్ణు పాత్రలో అభయ్ అలరించాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పని తీరు :-
సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలకు బ్యాంక్ గ్రౌండ్ స్కోరే ప్రాణం పోసిందని చెప్పాలి. ఎడిటింగ్ పనితనం కూడా బాగుంది. మాటలు ఆకట్టుకొని అలరించాయి.
సింక్ సౌండ్ ఉపయోగించడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్ :-
స్క్రీన్ ప్లే
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
డైలాగ్స్
దర్శి కామెడీ

మైనస్
రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు

 

జీ సినిమాలు సమీక్ష :-
గతంలో లఘు చిత్రాలతో తన ప్రతిభ నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ అందరినీ ఆకట్టుకొనే కథ, స్క్రీన్ ప్లే తో పెళ్లిచూపులును రూపొందించాడు. నూతన దర్శకుడైనప్పటికీ కొత్తదనంతో ఈ చిత్రాన్ని రూపొందించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు తరుణ్ భాస్కర్. ఇక సింక్ సౌండ్ ను సరిగ్గా వాడుకుంది యూనిట్. తెలంగాణ యాసతో కూడిన మాటలు సినిమాకు బలం చేకూర్చాయి. ఇలాంటి ప్రేమకథలకు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి. ఆ విషయంలో విజయ్,రీతూ వర్మ ల కెమిస్ట్రీ బాగా కుదిరింది.. కొత్త నటీనటులను దశలవారీగా పరిచయం చేస్తూ… విభిన్న పాత్రలతో కథను ముందుకు సాగించిన విధానం బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే పెళ్లిచూపులు చిన్న బడ్జెట్ తో రూపొందిన ఆహ్లాదభరిత కుటుంబకథా చిత్రంగా తెరకెక్కింది. అందరూ చూడదగ్గ మంచి చిత్రంగా రూపుదిద్దుకుంది. మరీ ముఖ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ సినిమా పంపిణీ బాధ్యతల్ని తీసుకోవడం…. పెళ్లిచూపులు సక్సెస్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఎక్కువమంది ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా సినిమాకు పబ్లిసిటీ ఇవ్వడంలో… ఎక్కువ థియేటర్లు దక్కేట్టు చేయడంలో సురేష్ బాబు పాత్ర కాదనలేనిది. సినిమా విజయానికి అది కూడా కీలకంగా మారింది.