'అభినేత్రి' మూవీ రివ్యూ

Friday,October 07,2016 - 04:30 by Z_CLU

నటీనటులు : ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ తదితరులు..
మ్యూజిక్ : సాజిద్ -వాజిద్, విశాల్ మిశ్ర, గోపీ సుందర్
సినిమాతో గ్రఫీ : మనుషు నందన్
కథ : ఎ.ఎల్. విజయ్,పాల్ ఆరోన్
మాటలు : కోన వెంకట్, సత్య
సమర్పణ : కోన ఫిలిం కార్పొరేషన్‌
నిర్మాణం : ఎమ్.వి.వి.సినిమాస్
నిర్మాత : ఎమ్.వి.వి.సత్యనారాయణ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఎ.ఎల్.విజయ్

ఎన్నో అంచనాల మధ్య తమన్న, ప్రభుదేవా, సోనూసూద్ కలిసి నటించిన హారర్ ఎంటర్టైనర్ ‘అభినేత్రి’ దసరా కానుకగా ఈరోజే విడుదలైంది. హారర్ జానర్ లో తమన్న ఫస్ట్ టైం చేసిన ఈ సినిమా ఏ రేంజ్ లో అంచనాలు అందుకుంది.. మిల్కీ బ్యూటీకి ఇది ఏమాత్రం కలిసొచ్చిందా..?

కథ :-

కృష్ణ(ప్రభుదేవా) అనే ఓ రాజమండ్రి కుర్రాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఎప్పటికైనా బాగా చదువుకున్న మోడ్రన్ అమ్మాయిని పెళ్లిచేసుకొని సెటిలవ్వాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో 32 మంది మోడరన్ అమ్మాయిలతో రిజెక్ట్ అవుతాడు. అలా ఓ మోడ్రన్ అమ్మాయి వేటలో పడిన కృష్ణ… అనుకోకుండా తన ఊరు వెళ్లి ఆ ఊరిలో పల్లెటూరి అమ్మాయి దేవి(తమన్న) ని పెళ్లాడాల్సి వస్తుంది. దేవిలాంటి పల్లెటూరి పిల్లని పెళ్లాడ్డం ఇష్టం లేకపోయినా బలవంతంగా తాళి కడతాడు. అలా ఊరిలో పెళ్లిచేసుకొని దేవిని ముంబై తీసుకెళ్ళి ఓ కొత్త ఇంట్లో కాపురం పెడతాడు. అప్పటి నుండి కృష్ణ కు రూబీ(తమన్న) రూపం లో కొన్ని కష్టాలు మొదలవుతాయి? అసలింతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? కృష్ణకి రూబీ వల్ల కలిగే ఇబ్బందులేంటి? రూబీ ఎవరు? ముంబై లో స్టార్ హీరో రాజ్ కరణ్(సోను సూద్) కు రూబీకి సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే ‘అభినేత్రి’ చూడాల్సిందే..

abhinetri-5
నటీనటుల పనితీరు:-

కృష్ణ పాత్రలో ప్రభుదేవా తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. డాన్స్, డైరక్షన్ మాత్రమే కాకుండా యాక్టింగ్ లో కూడా తను బెస్ట్ అని నిరూపించుకున్నాడు. ఇక సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తమన్నా గురించే. ‘దేవి’ ‘రూబీ’ అనే రెండు పాత్రల్లో తమన్నా ఇరగదీసింది. దేవి వంటి పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంటూనే మరో వైపు ‘రూబీ’ అనే మోడ్రన్ పాత్రలో తన గ్లామర్ డోస్ తో కిక్కెక్కించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాను ఒంటిచెత్తే నడిపించిన ఘనత తమన్నాకే దక్కుతుంది. రాజ్ కరణ్ అనే స్టార్ హీరో పాత్రలో సోనూ సూద్ మెప్పించాడు. మురళి శర్మ తన కామెడీతో సినిమాకు ప్లస్ అయ్యాడు. సప్తగిరి, హేమ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

abhinetri-3

టెక్నీషియన్స్ పని తీరు:-

టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది కెమెరామన్ గురించే. తన కెమెరా వర్క్ తో సినిమాకు ఎక్స్ ట్రా కళ తీసుకొచ్చాడు సినిమాటోగ్రాఫర్ మనుషు నందన్. ముఖ్యంగా పాటల చిత్రీకరణ ఆకట్టుకుంది. మ్యూజిక్ చాలా బాగుంది. ‘ఆకాశంలో రంగులని’ పాటకు సాహిత్యం భలే కుదిరింది. ఎడిటింగ్ ఫర్వాలేదు. మాటలు బాగానే అలరించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ‘నీ తల రాత బాగోలేదని మరొకరి తల రాత మార్చే హక్కు నీకు లేదు’, వంటి మాటలు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

abhinetri-16
జీ సినిమాలు సమీక్ష :-

హాస్పిటల్ లో ఫ్లాష్ బ్యాక్ ద్వారా దర్శకుడు కథ చెప్పిన విధానం అందరిలో కాస్త ఆసక్తి నెలకొనేలా చేసింది. గతంలో నాన్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు విజయ్.. మరోసారి మంచి పాయింట్ తో ఓ హారర్ బ్యాక్ డ్రాప్ లో అభినేత్రిని తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ తో కథ ను నడిపించిన దర్శకుడు, సెకండాఫ్ లో హారర్ సన్నివేశాలతో కథను నడిపించి అలరించాడు. తమన్నా, ప్రభు దేవా, సోనూసూద్ తమ పాత్రలతో సినిమాకు హైలైట్ గా నిలిచారు. ఎమీ జాక్సన్ ఓ గెస్ట్ రోల్ లో మెరిసి ఆకట్టుకుంది. ఇక తన డాన్స్ ఇష్టపడే ప్రేక్షకులను మొదటి పాట తోనే ప్రభు దేవా బాగా అలరించాడు.సెకండ్ హాఫ్ లో తమన్నా-ప్రభు దేవా… ప్రభుదేవా-మురళి శర్మ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కు బాగా అలరిస్తాయి. ప్రభుదేవాను తమన్నభయపెట్టే గ్రాఫిక్ సన్నివేశం, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా హైలైట్స్ గా నిలిచాయి. దర్శకుడు తను అనుకున్న పాయింట్ ను క్లైమాక్స్ లో చెప్పిన విధానం బాగా ఆకట్టుకుంటుంది.

ఫైనల్ గా…. అభినేత్రి మంచి సందేశం తో కూడిన హారర్ ఎంటర్ టైనర్.