'ధృవ' మూవీ రివ్యూ

Friday,December 09,2016 - 02:12 by Z_CLU

విడుదల : డిసెంబర్ 9th, 2016

నటీ నటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీ నటులు : అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సంగీతం : హిప్ హాప్ తమిజా

సినిమాటోగ్రఫీ : పి.య‌స్‌.వినోద్‌

ఎడిటర్ – నవీన్ నూలి

నిర్మాణం : గీతాఆర్ట్స్

నిర్మాత : అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌

దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

కోలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా గ్రాండ్ హిట్ సాధించిన ‘తని ఒరువన్’ కి రీమేక్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ధృవ’     భారీ అంచనాలతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఇంతకీ ఈ రీమేక్ తో రామ్ చరణ్ ఎలా ఎంటర్టైన్ చేసాడో ? చూద్దాం.

 dhruva-still-final

కథ :-

చిన్నతనం నుంచే మాస్టర్ ప్లానింగ్స్ తో పెద్ద సైంటిస్ట్ గా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ ఇండియాలో పెద్ద మెడికల్ సైంటిస్ట్ గా గుర్తింపు సాధించుకుని, ఆ  ముసుగులో మెడికల్ మాఫియాను శాసించే సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ను ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ధృవ(రామ్ చరణ్)  తన ధైర్య సాహసాలతో ఎలా పతనం చేసాడనేదే సినిమా కథాంశం.

నటీనటుల పని తీరు :

 ‘ధృవ’గా పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ధృవ మేకోవర్ కోసం ఎంతగా కష్టపడ్డాడో ప్రతి యాంగిల్ లో కనిపిస్తుంది. రామ్ చరణ్ గత సినిమాలతో పోలిస్తే బాడీ లాంగ్వేజ్ లోను చాలా వేరియేషన్ కనిపించింది . ఇక  సిద్దార్థ్ అభిమన్యు గా స్టైలిష్ లుక్ లో  హైలైట్ గా నిలిచాడు అరవింద్ స్వామి.  రకుల్ గ్లామరస్ పర్ఫామెన్స్ తో ముఖ్యంగా పరేషాన్ సాంగ్ లో కుర్రకారు ను తన అందంతో ఎట్రాక్ట్ చేసింది. గౌతమ్ క్యారెక్టర్ లో నవదీప్ బాగా నటించాడు. ఇక  పోసాని, నాజర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పని తీరు :

డైరెక్టర్ విజన్ ని రైట్ ఫ్రేమింగ్ లో ఫిక్స్ చేశాడు కెమెరా మెన్ పి.ఎస్.వినోద్. ధృవకి సినిమాటోగ్రఫీ పెద్ద ఎసెట్ అయితే హిప్ హాప్ తమిళ మ్యూజిక్ సినిమాకి బ్యాక్ బోన్. ధృవటైటిల్ సాంగ్ దగ్గర నుండి పరేషాన్‘, ‘నీతోనే డాన్స్ టు నైట్సాంగ్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టు సింక్ అయి, ఎప్పటికప్పుడు ఆడియెన్స్ ని కాన్సెప్ట్ తో కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్, సినిమాకే హైలెట్ గా నిలిచే ‘8  ఎలిమెంట్ అదుర్స్ అనిపించాయి. ఎడిటింగ్ సూపర్.  

 dhruva-final-still-2

జీ సినిమాలు సమీక్ష :

బ్రూస్ లీ తరువాత రామ్ చరణ్ కాస్త గ్యాప్ తీసుకొని తమిళ్ లో గ్రాండ్ హిట్ గా నిలిచిన సినిమా ‘తని ఒరువన్’ ను రీమేక్ చేస్తున్నాడనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా తమిళ్ లో గ్రాండ్ సక్సెస్ సాధించిన సబ్జెక్ట్ కావడంతో సినిమా లాంచ్ అయినప్పటి నుండే ఎక్స్ పెక్టేషన్స్ భారీగా సెట్ అయ్యాయి. ఒరిజినల్ సినిమా ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా చాలా జాగ్రత్త వహించి ఎలాంటి మార్పులు చేయకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. రీమేక్ సినిమా అయినప్పటికీ రామ్ చరణ్ చాలా వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ తో కనిపించి ఎంటర్టైన్ చేసాడు. ఒరిజినల్ సినిమాలో సిద్దార్థ్ క్యారెక్టర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచిన అరవింద్ స్వామిని తెలుగు లో కూడా సెలెక్ట్ చేసుకోవడం ఒకరకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న అరవింద్ స్వామి టాలీవుడ్ లో ఇక పర్మనెంట్ విలన్ గా సెటిలవడం ఖాయం. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కాస్త బోర్ కొట్టించిన సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా పుంజుకున్న స్పీడ్ అరవింద్ స్వామి-రామ్ చరణ్ మధ్య నడిచే సీన్స్ ఆడియన్స్ ను కట్టి పడేస్తాయి. మెడికల్ మాఫియా నేపధ్యంలో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘ధృవ’ మెగా ఫాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : 3.5  /5