'మన్యం పులి' రివ్యూ

Friday,December 02,2016 - 03:31 by Z_CLU

విడుదల : డిసెంబర్ 2 ,2016

నటీనటులు :మోహన్ లాల్, కమిలినీ ముఖర్జీ , జగపతిబాబు తదితరులు

సినిమాటోగ్రఫీ : షాజీ కుమార్

మ్యూజిక్ : గోపి సుందర్

ఎడిటింగ్ : జాన్ కుట్టి

సమర్పణ : తోమిచ‌న్ ముల్క‌పాద్

నిర్మాత : సింధూరపువ్వు కృష్ణారెడ్డి

రచన-స్క్రీన్ ప్లే : ఉదయ్ క్రిష్ణ

దర్శకత్వం : వైశాఖ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళ చిత్రం పులి మురుగన్. వంద కోట్లు వసూళ్లు సాధించి మల్లూవుడ్ రేంజ్ ను పెంచిన సినిమాగా ఇది సౌత్ అంతటా వార్తల్లో నిలిచింది. ఇప్పుడీ మూవీ మన్యం పులి పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. మల్లూలో రికార్డు సృష్టించిన ఈ సినిమా, టాలీవుడ్ లో కూడా హిట్ అవుతుందా…

manyam-puli-still
కథ :

చిన్నతనం నుంచి అడవిలో జీవించే కుమార్(మోహన్ లాల్) పులి బారిన పడి తన తండ్రి మరణించడంతో… అప్పటి నుంచి పులి బారి నుంచి తన గూడెం జనాలను రక్షిస్తూ ఎదుగుతాడు. ఇక పులి తమ స్థావరాల దగ్గరకు వచ్చిందంటే చాలు కుమార్ దగ్గరకి వెళ్తారు ఆ గూడెం వాసులు. అలా పులి నుండి జనాలను రక్షిస్తూ జీవితాన్ని కొనసాగించే కుమార్ ఓ అనుకోని సందర్భంలో అడవి దాటి బయటకి వెళ్లాల్సి వస్తుంది.. ఇంతకీ కుమార్ అడవిని, గూడెం ప్రజలను విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటి? చివరికి కుమార్ మళ్ళీ అడవికి తిరిగి వచ్చి బయటి ప్రపంచం గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.

నటీ నటుల పనితీరు :

విభిన్న పాత్రలతో స్టార్ నుండి సూపర్ స్టార్ గా ఎదిగి కంప్లీట్ యాక్టర్ గా గుర్తింపు అందుకున్న మోహన్ లాల్ కల్మషం తెలియని అడవి మనిషి కుమార్ పాత్రలో శెభాష్ అనిపించాడు. ఆ పాత్రలో లీనమైపోయిన తీరు చూస్తుంటే… జాతీయ స్థాయిలో మోహన్ లాల్ ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఇప్పటికీ తన ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ తరువాత తన నటనతో అందరినీ ఎట్రాక్ట్ చేసాడు బాల నటుడు మాస్టర్ అజాన్. సినిమా స్టార్టింగ్ లో కుమార్ చిన్నప్పటి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. కమిలినీ ముఖర్జీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నమిత ఓ చిన్న పాత్రలో తన బొద్దు అందాలతో ఆకట్టుకుంది. స్టైలిష్ విలన్ డాడీ గిరిజగా జగపతిబాబు మరోసారి అలరించాడు. ఇక లాల్, కిషోర్, విను మోహన్, బాల, నోబి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు: 

సినిమాకు తన సినిమాటోగ్రఫీతో అందం తీసుకొచ్చాడు కెమెరామెన్ షాయాజీ కుమార్. ముఖ్యంగా అడవి లొకేషన్స్, పులి తో యుద్ద సన్నివేశాలను అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాకు తన మ్యూజిక్ తో పెద్ద ఎస్సెట్ గా నిలిచాడు గోపి సుందర్. యాక్షన్ సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలకు ‘పులి రా.. పులి రా’ అనే బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశాలకు ప్రాణం పోసింది. పీటర్ హెయిన్స్ ఫైట్స్ సినిమాకు హైలైట్స్. జాన్ కుట్టి ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ఉదయ్ కృష్ణ కథ రొటీన్ గా అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకుంది. దర్శకుడు వైశాఖ్ మంచి కమర్షియల్ కథను ఎంచుకొని అదే ఆంగిల్ లో పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

manyam-puli-still-2
జీ సినిమాలు సమీక్ష :

మొన్నటి వరకూ విభిన్న పాత్రలతో క్లాస్ ఆడియన్స్ ను అలరిస్తున్న మోహన్ లాల్ సరైన మాస్ పాత్రలో కనిపించి మన్యం పులి గా అలరించాడు. మన తెలుగు ప్రేక్షకులకు మొదటి భాగంలో కథ కాస్త పాతగానే అనిపించినప్పటికీ
తనదైన స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఎక్కడా బొర్ కొట్టించలేదు రచయిత ఉదయ కృష్ణ. ఇక మలయాళ సినిమా అయినప్పటికీ మన తెలుగు నటులు జగపతిబాబు, కమిలినీ ముఖర్జీతో పాటు తెలుగు ప్రేక్షకులకు కథానాయకిగా పరిచయం ఉన్న నమిత ఈ సినిమాలో నటించడంతో కాస్త తెలుగు ఫ్లేవర్ అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ పులిను వేటాడే సీన్స్, కొన్ని ఎమోషన్, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఫైట్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్స్. సాదాసీదా ప్రేక్షకులకు పరవాలేదు బాగుంది అనిపించినా, కమర్షియల్ మాస్ ఎంటర్టైన్ మెంట్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారికి మాత్రం ‘మన్యం పులి’ బాగా నచ్చేస్తాడు. ‘సింధురపువ్వు’ కృష్ణారెడ్డి తెలుగులో అందించిన ఈ సినిమా మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ తో దూసుకుపోయి గ్రాండ్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఆ స్థాయిలో విజయం సాధించక పోవచ్చు  కానీ….. జనతా గ్యారేజ్ తో ఇక్కడ కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న మోహన్ లాల్ కు… మన్యం పులి సినిమా మరింత క్రేజ్ తీసుకురావడం మాత్రం ఖాయం.

 

రేటింగ్ : 3 /5