'చుట్టాలబ్బాయి' రివ్యూ

Friday,August 19,2016 - 04:30 by Z_CLU

                                                                                                                                                                                                  నటీ నటులు : ఆది,నమిత ప్రమోద్‌ , సాయి కుమార్ తదితరులు

సంగీతం : ఎస్‌.ఎస్‌. థమన్‌
సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌
మాటలు: భవాని ప్రసాద్‌
నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌.                                                                                                                        విడుదల తేదీ : 19-08-2016

 

కథ :-
హైదరాబాద్ లో ఓ బ్యాంకు లో లోన్స్ రికవరీ పర్సన్ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడిపే రికవరీ బాబ్జి(ఆది) అనే కుర్రాడు అనుకోకుండా ఓ సందర్భం లో ఏ.సీ.పీ చెల్లెలు కావ్య(నమితప్రమోద్‌)కి పరిచయం అవుతాడు. అలా కలిసిన వీరిద్దరి ని చూసి తన చెల్లెలు కావ్య బాబ్జి ప్రేమలో ఉన్నారని భావిస్తాడు ఏ.సీ.పీ. ఇక పెళ్లి చూపులు అనే మాట వినపడగానే ఇంట్లో నుండి పారిపోయే కావ్య ఓ పెళ్లి చూపుల కారణంగా ఇంటి నుండి పారిపోతుండగా అదే సమయం లో బాబ్జి ను కలుస్తుంది. ఇక అనుకోకుండా కావ్య తో తన సొంత ఊరుకి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి వీరిద్దరిని ఓ రెండు గ్యాంగ్ లు ఫాలో చేస్తుంటాయి. వారిలో ఓ గ్యాంగ్ ఏ.సీ.పీ మనుషులు కాగా మరో గ్యాంగ్ ఎవరు? ఆ గ్యాంగ్ కు వీరిద్దరికి సంబంధం ఏమిటి? వారి నుండి బాబ్జి ఎలా తప్పించుకున్నాడు? కావ్య తో ఇంటికి వెళ్లిన బాబ్జి కి ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి? ఇద్దరి మధ్య ప్రేమ లేదనుకునే కావ్య బాబ్జి లు చివరికి ఎలా ప్రేమలో పడ్డారు? అనేదే ఈ చిత్ర కధాంశం.

 

నటీ నటుల పనితీరు :
రికవరీ బాబ్జి గా ఆది అలరించాడు. ఆది లుక్ ఆకట్టుకుంది. ఇక కావ్య పాత్ర లో నమిత ప్రమోద్‌ తన నటన తో పరవాలేదనిపించుకుంది. ఇక దొరబాబు గా సాయికుమార్ పాత్ర బాగున్నా అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లా అనిపించలేదు. మిస్టర్ ఇగో రెడ్డి పాత్ర లో ఫృద్వి కాస్త నవ్వించాడు. వరదరాజుగా పోసాని, కె.కె(కిడ్నాప్ క్రిష్) గా అలీ, షకలక శంకర్, అన్నపూర్ణ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్ల పనితీరు :
ఎస్‌.అరుణ్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ అందించిన పాటలు కాస్త రొటీన్ అనిపించాయి. మొదటి పాట మినహా ఏ పాట పెద్దగా అలరించలేదనే చెప్పుకోవాలి. ఎడిటింగ్ పరవాలేదు. భవాని ప్రసాద్‌ అందించిన డైలాగ్స్ కొన్ని సందర్భాల్లో అలరించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు వీరభద్రం కథ మొదలు పెట్టిన తీరు బాగుంది కానీ ఆ కథను అలరించే సన్నివేశాలతో ముందుకుతీసుకెళ్లలేకపోయాడు.

 

జీ సినిమాలు సమీక్ష:-
ఒక బ్యాంకులో రికవరీ జాబ్ చేసే బాబ్జి పాత్రతో కథ ను ప్రారంభించిన దర్శకుడు వీరభద్రం…. ఆ కథను అలాగే కొనసాగించకుండా కాస్త రొటీన్ ట్రాక్ ఎక్కించాడనే చెప్పాలి. మొదటి భాగంలో పృద్వి కామెడీ తో మ్యాజిక్ చేసిన దర్శకుడు రెండో భాగం లో మాత్రం అలాంటి మ్యాజిక్ చెయ్యలేక కొన్ని రొటీన్ సన్నివేశాలతో కథను సాగదీశాడు. ఇక ఆది కు సరిపడే యాక్షన్ సన్నివేశాలకు బదులు టాప్ కమర్షియల్ హీరో కు సమకూర్చినట్లు ఫైట్స్ ను సమకూర్చిన తీరు ప్రేక్షకుల్లో కాస్త నవ్వు తెప్పిస్తుంది. మొదటి భాగం లో కొన్ని అలరించే సన్నివేశాలు, పృద్వి కామెడీ , హీరో ఆది ఎనర్జిటిక్ నటన ఈ సినిమాకు ప్లస్. ఇక ఈ కమర్షియల్ కథకు ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు అన్నదానికి చివర్లో ఏదో సిల్లీగా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
ఫైనల్ గా చెప్పాలంటే ‘చుట్టాలబ్బాయి’  రొటీన్ కమర్షియల్ సినిమా. కొన్ని కామెడీ సన్నివేశాల కోసం మాత్రం ఓ సారి చూడొచ్చు.