'రుస్తుం'(హిందీ) రివ్యూ

Saturday,August 13,2016 - 08:51 by Z_CLU

చిత్రం :రుస్తుం
నటీ నటులు : అక్షయ్ కుమార్, ఇలియానా, ఇషా గుప్తా తదితరులు
మ్యూజిక్ :అంకిత్ తివారి, జీత్ గంగూలీ,రాఘవ్ సచార్, ఆర్కో ప్రవో ముఖర్జీ
సినిమాటోగ్రఫీ :సంతోష్ తుండియిల్
దర్శకత్వం :తిను సురేష్ దేశాయ్
ప్రొడక్షన్ : జీ స్టూడియో
నిర్మాత : నిరాజ్ పాండే
విడుదల తేదీ : 12-08-2016
కథ :
రుస్తుం పవ్రి (అక్షయ్ కుమార్) అనే నిజాయితీ గల నేవి ఆఫీసర్ ఒక రోజు తన విధులను తొందరగా ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో తన భార్య సింథియా ఓ వ్యక్తి తో వివాహేతర సంబంధం చూసి షాక్ అయ్యి ఆ వ్యక్తి చంపేసి పోలీసులకు లొంగి పోతాడు. ఇంతకీ రుస్తుం ఆ వ్యక్తి ను చంపడానికి తన భార్య తో వివాహితర సంబంధమే కారణమా? చివరికి కోర్టు రుస్తుం కి ఎలాంటి శిక్ష వేసింది? ఇంతకీ రుస్తుం తన భార్య ను క్షమించాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీ నటుల పని తీరు :
అక్షయ్ కుమార్ రుస్తుం పాత్రలో నటించాడు అందం కంటే జీవించాడు అనడం సబబు అనే చెప్పాలి. ముఖ్యంగా కోర్ట్ సన్నివేశాల్లో తన దైన డైలాగ్ డెలివరీ, నటనతో మరో సారి ఆకట్టుకున్నాడు అక్షయ్. ఇక భార్య గా భర్త లేనప్పుడు మరొకరి తో సంబంధం పెట్టుకునే పాత్రలో ఇలియానా నటన బాగుంది. ఇషా గుప్తా తన నటనతో పరవాలేదనిపించుకుంది. అర్జన్ బజ్వా తో సహా మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీషియన్స్ పని తీరు :
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్ అనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని అందంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ సంతోష్. సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సంభాషణలు బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథకు  తన దైన స్క్రీన్ ప్లే తో న్యాయం చేసాడనే చెప్పాలి. విపుల్ అందించిన మాటలు  అలరించాయి.ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
జీ సినిమాలు సమీక్ష :
ట్రైలర్ తో అందరి చూపు ను ఆకర్షించిన దర్శకుడు కథ ను సినిమాగా మలచడం లో తన దైన ప్రతిభ కనబరిచాడనే చెప్పుకోవాలి. భార్య భర్తల మధ్య భావోద్వేగాల తో కూడిన సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు దర్శకుడు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సన్నివేశాలే సినిమాకు బలం చేకూర్చాయి. మొదటి భాగం సాదాసీదాగా అనిపించినా రెండో భాగం లో వచ్చే ట్విస్ట్స్ ప్రేక్షకుడిని బాగా  ఆకట్టుకుంటాయి. నటీ నటులు తమ నట ప్రతిభ తో కథను ముందుకు నడిపించిన తీరు బాగుంది.
కోర్టు లో  సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆసక్తి తో కట్టిపడేసేలా ఉన్నాయి.ముఖ్యంగా ఈ  సన్నివేశాల్లో అక్షయ్ కుమార్ నటన అందరినీ అలరిస్తుంది.  ఫైనల్ గా చెప్పాలంటే రుస్తుం  తప్పకుండా చూడాల్సిన సినిమా.