'మరకతమణి' రివ్యూ

Friday,June 16,2017 - 02:50 by Z_CLU

న‌టీన‌టులు : ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ

సంగీతం: దిబు నైన‌న్ థామ‌స్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌ : పి.వి.శంక‌ర్‌

నిర్మాతలు : రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌

క‌థ‌,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం : A.R.K.శ‌రవణన్

‘గుండెల్లో గోదారి’,’మలుపు’ సినిమాలతో హీరోగా గుర్తింపు అందుకున్న ఆది పినిశెట్టి లేటెస్ట్ గా ‘సరైనోడు’లో వైరం ధనుష్ గా మెస్మరైజ్ చేసి తాజాగా ‘మరకతమణి’ ఎంటర్టైన్ చెయ్యడానికి ఈరోజు థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. A.R.K శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎడ్వంచ‌రస్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈరోజే విడుదలైంది.

కథ :

విక్రమాదిత్యుడికి ప్రీతికరమైన మరకతమణిని సొంతం చేసుకోవడానికి చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తి అందరికీ డబ్బు ఆశచూపుతూ ఆ మణిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తాడు. 20 ఏళ్ల క్రితం ఆ మణిని సొంతం చేసుకోవడానికి వెళ్లిన వాళ్ళందరూ చనిపోవడంతో.. దాని పేరు వినగానే అందరు భయపడుతుంటారు. ఈ క్రమంలో తనకున్న ఆర్ధిక ఇబ్బందులు తీర్చుకోవడానికి 10 కోట్లకు మరకతమణిని అప్పగిస్తానని ఒప్పందం కుదుర్చుకుంటాడు రఘు నందన్(ఆది పినిశెట్టి). అలా మరకతమణిని సొంతం చేసుకోవడం కోసం కొన్ని ఆత్మల సహకారం అందుకుంటాడు. ఇంతకీ మరకతమణిని ముట్టుకుంటే చంపేదెవరు..? చివరికి రఘు నందన్ మరకతమణిని సాధించాడా.. లేదా..అనేది ఈ సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు:

తమిళ, తెలుగు సినిమాలతో నటుడిగా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆది పినిశెట్టి ఈ సినిమాలో రఘు నందన్ అనే క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా డబ్బు కోసం ఎంతకైనా తెగించే క్యారెక్టర్ లో కనిపిస్తూనే మరో వైపు లవ్ సీన్స్, కామెడీ సీన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిక్కీ గల్రాని యాక్టింగ్ స్కిల్స్ తో ఫరవాలేదనిపించుకుంది. తన క్యారెక్టర్ డైలాగ్ డెలివరీతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు రామదాసు. గతంలో విలన్ గా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆనంద్ రాజ్ కామెడీ విలన్ గా అలరించాడు. బ్రహ్మానందం కామెడీ పండలేదు. కోటా శ్రీనివాసరావు, డానియల్, అరుణ్ రాజ్‌, కామ‌రాజ్‌ మిగతా నటీనటులందరూ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు
దిబు నైన‌న్ థామ‌స్‌ గురించే.. తన మ్యూజిక్ తో, బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు దిబు. పి.వి.శంక‌ర్‌ సినిమాటోగ్రాఫీ బాగుంది. ప్ర‌స‌న్న.జి.కె ఎడిటింగ్ బాగుంది. మాటలు ఆకట్టుకున్నాయి. A.R.K.శ‌ర్వ‌న‌ణ్ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఫరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు సాధిస్తూ సూపర్ హిట్స్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎడ్వంచ‌రస్ థ్రిల్ల‌ర్ అంటే ఆ సినిమాకు ఇంకాస్త క్రేజ్ పెరగడం కామనే. ఇలాంటి వెంచర్ కు ఆది పనిశెట్టి లాంటి నటుడు యాడ్ అవ్వడంతో టాలీవుడ్ లో కూడా మరకతమణిపై అందరి దృష్టి పడింది. టీజర్, ట్రైలర్ సినిమా కి మరింత హైప్ తీసుకురావడంతో రిలీజ్ కి ముందే ఈ సినిమా చిన్నసైజు బజ్ క్రియేట్ చేసింది.
సినిమా విషయానికొస్తే దర్శకుడు రొటీన్ పాయింట్ నే సెలెక్ట్ చేసుకున్నప్పటికీ.. ఆ పాయింట్ కి ‘మరకతమణి’ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాడ్ చేసి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో అలరించాడు. ముఖ్యంగా కామెడీ స్క్రీన్ ప్లే తో సినిమాను ముందుకు నడిపించిన తీరు బాగా ఆకట్టుకుంది. దర్శకుడిగా క్యారెక్టర్స్ కి తగిన నటులను సెలెక్ట్ చేసుకొని అక్కడే సక్సెస్ అయ్యాడు శరవణన్. ఇక క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్, కామెడీ సీన్స్, ట్విస్టులు, క్లైమాక్స్ సినిమాలో హైలైట్స్ . ఫైనల్ గా.. ఫాంటసీ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి మరకతమణి వంద శాతం నచ్చుతుంది.

రేటింగ్ : 2.75 /5