ZeeCinemalu – March 11

Wednesday,March 10,2021 - 10:45 by Z_CLU

అవును-2 నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర డైరెక్టర్ : రవి బాబు ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015 రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

======================

కల్యాణ వైభోగమే నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్ ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియుతదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్ రిలీజ్ డేట్ : 4 మార్చి 2016 నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

========================

శివాజీ నటీనటులు : రజినీకాంత్, శ్రియ శరన్ ఇతర నటీనటులు : వివేక్, సుమన్, రఘువరన్, మణివన్నన్, వడివుక్కరసి, కోచిన్ హనీఫా తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్ డైరెక్టర్ : S.శంకర్ ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్ రిలీజ్ డేట్ : 15 జూన్ 2007 ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…? తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..? లేదా..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=========================

శైలజారెడ్డి అల్లుడు నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్ డైరెక్టర్ : మారుతి దాసరి ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018 ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ). తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

========================

సుప్రీమ్ నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్, మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్ డైరెక్టర్ : అనల్ రావిపూడి ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : మే 5, 2016 సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

==========================

చిరుత నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ డైరెక్టర్ : పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్ రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.